హిట్ ఇచ్చినా ఫేట్ మారని దర్శకుడు ..

Posted December 28, 2016

vamshi paidipally not coming much movie offers
ఎన్ని హిట్ లు ఇచ్చినా కొందరు దర్శకులకి వెంటవెంటనే సినిమాలు చేసే ఛాన్స్ దక్కదు .ఏదో ఇబ్బంది వచ్చి హిట్ పడ్డ తర్వాత కొత్త సినిమా మొదలెట్టడానికి అనుకోని సమస్యలు వస్తాయి .ఈ కోవలో ఇంతకు ముందు బోయపాటి శ్రీను ఉండేవాడు .ఇప్పుడు మరో డైరెక్టర్ కి కూడా ఇదే సంకటం ఎదురవుతోంది .ఆయనే పైడిపల్లి వంశీ .మొదటి సినిమా మున్నా తప్ప బృందావనం ,ఎవడు,ఊపిరి అన్నీ మంచి హిట్ లే .కానీ మున్నా 2007 లో రిలీజ్ అయితే ఈ 10 ఏళ్లలో అయన మరో మూడు సినిమాలు మాత్రమే పూర్తి చేసాడు . ఇప్పుడు కూడా మహేష్ బాబుతో మూవీ డిసైడ్ అయిపోయినా .. చిన్నచిన్న సమస్యలతో నిర్మాతలు మారారు . అయినా ఇప్పటికీ సినిమా ప్రారంభం విషయంలో ఓ స్పష్టత లేదు .

కొత్త సినిమా ప్రారంభం కావడం మాత్రమే కాదు క్రేజ్ విషయంలోనూ అంతే .మంచి సినిమాలు చేస్తాడని పేరొచ్చినా అయన కోసం నిర్మాతలు ఎగబడే పరిస్థితి లేదు .తీసిన నాలుగు సినిమాల్లో మూడింటికి దిల్ రాజు నిర్మాత .ఇలా ఏ విధంగా చూసినా హిట్ఇచ్చిన ఈ డైరెక్టర్ ఫేట్ మారలేదు .భవిష్యత్ లో ఆ పరిస్థితి మారి ఆయనకి ఉజ్జ్వల భవిష్యత్ రావాలని ఆశిద్దాం ..మంచి సినిమాలు తీసే దర్శకుడికి మంచి జరగాలని కోరుకుందాం.

SHARE