నేను లోకల్ అంటున్న ఎమ్మెల్యే!!

0
287
vamsichand reddy local mla

Posted [relativedate]

vamsichand reddy local mla
కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయనకు… తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, వ‌న‌ప‌ర్తికి చెందిన నిరంజన్ రెడ్డితో గొడవ మొదలైంది. ఎందుకంటే కల్వకుర్తికి రావాల్సిన నీళ్లను వనపర్తికి తీసుకెళ్తున్నారన్న‌ది ఆయ‌న ఆరోప‌ణ‌. ఈ విష‌యంలో త‌న లోక‌ల్ ఏరియా క‌ల్వ‌కుర్తిలో చ‌ర్చ‌కు సిద్ధ‌మంటూ నిరంజ‌న్ రెడ్డికి స‌వాల్ విసిరారు. అటు నిరంజ‌న్ రెడ్డి కూడా సై అన్నారు. చివ‌ర‌కు వంశీ వ‌చ్చారు. ఈ చ‌ర్చ‌కు నిరంజ‌న్ రెడ్డి కూడా వ‌స్తార‌ని భావించారు. కానీ ఆయ‌న మాత్రం రాలేదు.

నిరంజ‌న్ రెడ్డి చ‌ర్చ‌కు రాక‌పోయే స‌రికి… ఒక్క‌సారిగా టీఆర్ఎస్ డిఫెన్స్ లో ప‌డిపోయింది. ఈ విష‌యంలో పార్టీ పెద్ద‌ల దాకా వెళ్లింది. చివ‌ర‌కు ఇలాంటి స‌వాళ్లను లైట్ తీసుకుంటే ప్ర‌జ‌ల్లోకి రాంగ్ సిగ్న‌ల్స్ వెళ్లే ప్ర‌మాద‌ముంది కాబ‌ట్టి ఎలాగోలా క‌వ‌ర్ చేయాల‌ని ఆదేశించార‌ట‌. దీంతో చివ‌ర‌కు నిరంజ‌న్ రెడ్డి స్పందించారు. ఈనెల 10న చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని చెప్పుకొచ్చారు.

నిజానికి వంశీచంద్ రెడ్డి వాద‌న‌లో కొంత నిజముందంటున్నారు క‌ల్వ‌కుర్తికి చెందిన అన్నిపార్టీల నేత‌లు. చివ‌ర‌కు టీఆర్ఎస్ నేత‌లు కూడా ఆఫ్ ది రికార్డ్ లో వంశీ వాద‌న‌తో ఏకీభ‌విస్తున్నారు. నిరంజ‌న్ రెడ్డి అన‌వ‌స‌రంగా తెగే దాకా లాగుతున్నార‌ని క‌ల్వకుర్తి గులాబీ నేత‌లు చెబుతున్న మాట‌.

అటు కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఈ వాద‌న‌లో లోక‌ల్ నేత‌ వంశీచంద్ రెడ్డే గెలిచాడ‌ని ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. నిరంజ‌న్ రెడ్డి వాద‌న‌లో బ‌లం లేదు కాబ‌ట్టే ఆయ‌న మొహం చాటేడ‌ని విమ‌ర్శిస్తున్నారు. అంతేకాదు ఈనెల 10న కూడా నిరంజ‌న్ రెడ్డి వ‌చ్చే అవ‌కాశ‌మే లేదంటున్నారు. ఎంతైనా లోక‌ల్ … లోక‌లేనంటూ వంశీచంద్ రెడ్డిని మెచ్చుకుంటున్నారు.

Leave a Reply