Posted [relativedate]
ఇప్పటికే సంచనలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్న వర్మ తీస్తున్న సినిమా వంగవీటి ఆడియోలో వర్మ వంగవీటి మోహన రంగ ఫ్యాన్స్ ను హర్ట్ చేశాడు. అదెలాగ అంటే వర్మ మాట్లాడుతున్న సమయంలో బాగా అల్లరి చేసిన రంగ ఫ్యాన్స్ సినిమాలో రంగ డైలాగు ఏదైనా చెప్పాలని అన్నారు. కాసేపు సైలెంట్ గా చూసిన వర్మ వారిని డైలాగు రూపంలో హెచ్చరించాడు. ఆ తర్వాత రంగ డైలాగులన్ని స్క్రీన్ మీదే చూడాలని అన్నారు వర్మ.
ఇక అనుకున్నట్టుగానే ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ ఆడియో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇదేదో స్టార్ హీరో సినిమాల ఆడియోలాగా అనిపించేలా జనం వచ్చారు. యూనివర్సిటీ గ్రౌండ్ పెద్దది కాబట్టి గ్రౌండ్ కంట్రోల్ చేయగలిగారు. ఇక వర్మ సినిమా అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎటాక్ ఉండాల్సిందే.
ఈ ప్రయత్నంలో స్టేజ్ కు దగ్గరగా ఓ 50 మందితో కూడినా బ్యాచ్ పవర్ స్టార్ అని కేకలు పెట్టడంతో ఆడియో రిలీజ్ కార్యక్రమంలో కాస్త వేడెక్కింది. యాంకర్ ఝాన్సి పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడిన మాటలు కాస్త వారికి కోపం వచ్చేలా చేశాయి.