వర్మ కి వంగవీటి వార్నింగ్ ఇలా..?

0
556

Posted [relativedate]

Image result for kodali nani trying to convince ramgopal varma and vangaveeti radha krishna

తాను జీవితంలో ఇప్పటివరకు చాలా సీరియస్ వార్నింగులు చూశాను గానీ.. మొట్టమొదటిసారి నవ్వుతూ సీరియస్ వార్నింగ్ ఇచ్చేవాళ్లను చూశానని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. వంగవీటి సినిమా నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, ఆయన తల్లి రత్నకుమారిలను విజయవాడలో కలిసి వచ్చిన తర్వాత నేరుగా మీడియాతో అయితే మాట్లాడలేదుగానీ, ట్విట్టర్ ఖాతా ద్వారా తన అభిప్రాయాలు వెల్లడించారు. ‘మీటింగ్ అంత ఆశాజనకంగా సాగలేదు. సినిమాకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. నేను మాత్రం వెనక్కి తగ్గను.. ఏం జరుగుతుందో చూడాలి. నేను సీరియస్ వార్నింగ్లు చాలా చూశాను. కానీ తొలిసారిగా నవ్వుతూనే వార్నింగ్ ఇవ్వటం చూశాను. డేంజరస్. అయినా వంగవీటి సినిమా విషయంలో నా ఆలోచనలపై వెనక్కి తగ్గను. ఏమవుతుందో చూడాలి’ అంటూ కామెంట్ చేశారు.

‘మా అసంతృప్తి చెందలేదు: రాధా
మా అభ్యంతరాలను వర్మకు తెలియజేశాం.. అదే విషయాలపై కోర్టుకు వెళ్లాం, సినిమా అభ్యంతరకరంగా ఉంటే అంగీకరించం.అని వంగవీటి రాధా స్పష్టం చేసారు

ఎవరూ వెనక్కి తగ్గలేదు: కొడాలి నాని
ఇరువర్గాల మధ్య జరిగిన చర్చలు అంత సంతృప్తికరంగా సాగలేదని ఈ చర్చల్లో పాల్గొన్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) తెలిపారు.అభ్యంతరకర సన్నివేశాల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది వర్మే’ అని ఆయన అన్నారు.⁠⁠⁠⁠

I saw many serious warnings .1st time I saw very smilingly serious warnings .Dangerous .But I will not compromise on my vision of Vangaveeti

Leave a Reply