“ఘరానామొగుడు” హీరోయిన్ రీ ఎంట్రీ

Posted [relativedate]

vani viswanath re entry in bellamkonda srinivas movieపెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు చాలా మంది  హీరోయిన్లు. ఆ విధంగా కనుమరుగైన ఒక్కొక్క హీరోయిన్ ఇప్పుడు రీ ఎంట్రీలు ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ కూడా రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఘరానా మొగుడు సినిమా గుర్తుంది కదూ. అందులో సెకండ్ హీరోయిన్ గా నటించిన వాణి విశ్వనాధ్ ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వనుంది.  

ఎన్టీఆర్‌, చిరంజీవి వంటి స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించిన ఈ అందాల భామ ఇప్పుడు బోయపాటి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరోగా, ర‌కూల్ ప్రీత్‌, ప్ర‌గ్యాజైశ్వాల్ హీరోయిన్లుగా  తెర‌కెక్కుతున్న సినిమాలో వాణీ విశ్వనాధ్ చేత ఓ ఇంట్రెస్టింగ్ రోల్ చేయిస్తున్నాడట బోయపాటి. హీరోయిన్ గా యావరేజ్ హిట్స్ మాత్రమే అందుకున్న వాణి మరి రీ ఎంట్రీతో ఎలాంటి హిట్స్ అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here