విశాల్ లవ్ బ్రేకప్…. రీల్ కాదు రియల్

Posted September 30, 2016

 varalakshmi tweet vishal love story break up

తమిళ్ తెరపై మెరుస్తున్న తెలుగబ్బాయి విశాల్ లవ్ స్టోరీ బ్రేకప్ దాకా వెళ్ళింది..? సినీ సన్నివేశాలకు మించి రియల్ లైఫ్ లో మలుపులున్నాయని ఇప్పటి దాకా ఇలాంటి డేట్ లు ఉన్నా పైకి ఎలాంటి ఆధారాలు లేవు. అయితే విశాల్ ప్రేమలో ఉన్నాడని భావిస్తున్న శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి తాజా ట్వీట్ ఎన్నో ప్రశ్నలకు జవాబుగా నిలుస్తోంది..

వరలక్ష్మి లవ్ గురించి ఏమి చెప్పిందంటే “ప్రేమ ఇటీవల పరిహాసమై పోయింది. ఇటీవల ఓ మనిషి ఏడేళ్ల బంధాన్నితేలిగ్గా వదులుతున్నాడు. అది కూడా ఆ అమ్మాయికి తన మేనేజర్ ద్వారా తెలియజెప్పాడు. ప్రపంచంలో ప్రేమ ఏమైపోతుందో.? ఎక్కడుందో”

ఈ ట్వీట్ విశాల్ గురించేనని కోలీవుడ్ లో గుప్పుమంటోంది. వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ తో గొడవల వల్లే విశాల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏమైనా ఓ ఆడపిల్ల తండ్రి, ప్రియుడు మధ్య సాగుతున్న రియల్ స్టోరీ రీల్ కథను తలపిస్తోంది…

Breakups hv reached a new low.. a guy broke up a 7yr relationship thru his manager.. lol what’s has the world come too..whr is the love..?!

SHARE