చెన్నై తీరాన్ని తాకిన “వర్ధ”

0
341
cyclone

Posted [relativedate]

cyclone

వర్ద’ తీవ్ర తుపాను కొద్దిసేపటి క్రితం చెన్నై తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో 140 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో చెన్నై నగరం అతలాకుతలం అవుతోంది. గాలుల తీవ్రతకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడుతున్నాయి. భారీ వర్షంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. తుపాను కారణంగా చెన్నైకి రోడ్డు, రైలు, విమాన మార్గాల రాకపోకలు ఆగిపోయాయి.

తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు పడతాయని అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు తీరం దాటే సమయంలో గంటకు 110కి.మీ వేగంతో గాలులు వీస్తాయన్నారు. 22 ఏళ్ల తర్వాత చెన్నైకు సమీపంలో తుపాను తీరం దాటనుంది. దీని ప్రభావంతో చెన్నై సహా తమిళనాడు ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలు, పెనుగాలులు బీభత్సం సృష్టిస్తాయని అధికారులు హెచ్చరించారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారులకు అప్రమత్తం చేశారు. తుపాను పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు

**హెల్ప్ లైన్ నంబర్స్ : ఆంధ్రప్రదేశ్ ‌0866-2488000, తమిళనాడు 044-28593990

విజయవాడలోని కమాండ్ కంట్రోల్ కేంద్రంతో పాటు తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టరుట్లలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిన సమీక్షిస్తున్నారు. ప్రజలకు సమాచారం అందిస్తున్నారు. జిల్లా యంత్రాంగాలను సమన్వయం చేయడానికి ప్రభుత్వం నాలుగు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రకాశం జిల్లాకు ఎంకే మీనా, చిత్తూరు జిల్లాకు రవిచంద్ర, నెల్లూరు జిల్లాకు శ్రీధర్, రాంగోపాల లు పరిస్థితి సమీక్షిస్తున్నారు.

గాలుల అధిక తీవ్రత కారణంగా చెన్నైలోని హోర్డింగ్‌లు, చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడుతున్నాయి. నగరంలో ఇప్పటివరకు 300పైగా చెట్లు కూలినట్లు చెన్నై నగరపాలక సంస్థ తెలిపింది. వీటిని హుటాహుటిన తొలగించి రాకపోకలకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో అనేక ప్రాంతాల్లో చీకట్లు అలుముకున్నాయి. నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.

Leave a Reply