జక్కన్న స్పూర్తితోనే వర్మ న్యూక్లియర్..!

0
325

Posted [relativedate]

rj111వర్మ చేస్తున్న న్యూక్లియర్ రాజమౌళి స్పూర్తితో చేస్తుందా ఏంటి నిజమేనా ఇదంతా అంటే అవునని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. వర్మ ఎనౌన్స్ చేసిన 340 కోట్ల ప్రాజెక్ట్ న్యూక్లియర్ ఎనౌన్స్ చేసిన కొద్దిసేపటికే ‘బ్యాక్ విత్ ఏ బ్యాంగ్’ అని ట్వీట్ చేశాడు రాజమౌళి. అయితే ఈసారి అందరి అంచనాలను మించి వర్మ రిటర్న్ ట్వీట్ చేశాడు. అదెలా అంటే బాహుబలి చూసి స్పూర్తి పొందాక తానో ప్రామిస్ చేశానని.. అదే ఈ న్యూక్లియర్ అని అన్నాడు వర్మ. అంతేకాదు కచ్చితంగా ఈ బ్యాంగ్ ను బ్లాస్ట్ చేస్తా అని కూడా అంటున్నాడు.

శివ టైంలోనే ఎన్నో సంచలనాలకు నాంధి పలికిన వర్మ హాలీవుడ్ సినిమా ఎనౌన్స్ చేయగానే అతనికి ఇంటర్నేషనల్ మూవీ చేసే సత్తా ఉందని అందరు అభిప్రాయపడ్డారు. ఇక జక్కన్న స్పూర్తితోనే వర్మ ఈ సినిమా చేస్తున్నాడా అన్నది పక్కన పెడితే ఇలా ఇద్దరు టాలీవుడ్ టాప్ డైరక్టర్ అభిమానులను అలరించేలా ట్వీట్స్ చేసుకోవడం అందరిని ఆకట్టుకుంది.

పరిశ్రమకు సంబంధించి ఏ చిన్న అద్భుతం జరిగినా ముందు తన అభిప్రాయాన్ని తెలిపే రాజమౌళి వర్మ తీస్తున్న న్యూక్లియర్ మూవీకి తన తరపున బెస్ట్ విసెష్ అందించారు. వర్మతో ఏళ్ళనాటి అనుబంధం ఉన్న సి.ఎం.ఎ గ్రూప్ ఈ సినిమాను నిర్మిస్తుంది. కేవలం భారతీయ నటులే కాకుండా ఫారిన్ ఆర్టిస్ట్ లు కూడా ఈ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

Leave a Reply