వర్మవెటకారం ..మెగా ఫాన్స్ ఆగ్రహం

81
Spread the love

Posted [relativedate]

varma joke on mega star fand angry
ఖైదీ నెంబర్ 150 చిత్రం గురించి దర్శకుడు వర్మ తాజాగా ఇంకో సెటైర్ పేల్చాడు. ఈసారి ఫస్ట్ లుక్ పోస్టర్ ని టార్గెట్ చేస్తూ మెగా ఫాన్స్ ని ఉడికించే కామెంట్స్ చేశాడు వర్మ . ఇంతకుముందు ఈ సినిమా మీద చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నట్టు వర్మ మొదలెట్టాడు.పైగా మెగా ఫాన్స్ మనసు నొప్పించినందుకు సారీ చెప్పారు.ఓహో వర్మ మనసు మారిందేమో అనుకుంటే పొరబడినట్టే. అక్కడే అయన వెటకారం మొదలైంది.

తాజాగా విడుదలైన ఖైదీ నెంబర్ 150 పోస్టర్ ని పోస్ట్ చేసిన వర్మ …ఈ చిత్రంలో మెగా స్టార్ ఫోజ్ చూసి మేడం టుస్సాడ్స్ మ్యూజియం వారు తమ దగ్గరున్న సగం విగ్రహాల్ని అవతల పడేస్తారని వర్మ కామెంట్ చేశాడు.మెగా స్టార్ ని ఈ ఫోజ్ లో కూర్చోబెట్టిన డిజైనర్,దర్శకుడి పాదాలు తాకాలని ఉందని వర్మ ట్వీట్ చేశాడు.స్వయం ప్రేమ,స్వీయ రక్తికి పరాకాష్టగా దీన్ని వర్మ అభివర్ణించారు.ఇక మెగా స్టార్ ని ఇలా చూస్తే జర్మన్ తత్వవేత్త హెగెల్ ముద్దాడేవారని చెప్పారు.ఈ పోస్టర్ డిజైనర్ తో పాటు ..ఈ ఫోజ్ లో కూర్చోడానికి మెగా స్టార్ ని ఒప్పించిన ఇతరుల ఫోన్ నంబర్లు,చిరునామాలు కావాలని వర్మ రిక్వెస్ట్ చేశాడు.ఈ మొత్తం కామెంట్స్ లో వర్మ వెటకారం చూసి మెగా ఫాన్స్ రగిలిపోతున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here