ట్రంప్ గెలుపుపై వర్మ సంచలన వ్యాఖ్యలు..!

0
1054

Posted [relativedate]

dt1916అమెరికా సంయుక్త రాష్ట్రాల 45వ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ నే అందరు గెలిపించారు. పదునైన ప్రచార అస్త్రాలతో అటు విమర్శలతో పాటు క్రేజ్ సంపాదించిన ట్రంప్ చివరకు అమెరికా ప్రెసిడెంట్ పదవిని దక్కించుకున్నాడు. అయితే ఈ విషయం గురించి వర్మ స్పందిస్తూ నాలుగు నెల క్రితమే తాను ఈ విషయం డిక్లేర్ చేశానని.. అందుకు తనకు తానే థాంక్స్ చెప్పుకుంటున్నా అని అన్నారు.

అంతేకాదు ఈరోజు సాయంత్రం అందరికి పెద్ద పార్టీ ఇస్తున్నాను.. ట్రంప్ ను నాన్ సెన్ అనుకున్నారు కాని అలా అన్న వారే నాన్ సెన్స్ గా మాట్లాడారని అనుకోవచ్చని అంటున్నాడు. అంతేకాదు ఇదవరకు ఒబామా గెలిచిన స్థానాల్లోనే ట్రంప్ గెలవడంతో ట్రంప్ కేవలం హిల్లరి మీదనే కాదు ఒబామా మీద కూడా గెలిచాడని అంటున్నాడు. ఏది ఏమైనా అమెరికా ప్రెసిడెంట్ గురించి వర్మ చెప్పిన ప్రిడిక్షన్ బాగా కలిసి వచ్చింది. ఆయన గెలవడం వల్ల వర్మకు ఏం లాభమో తెలియదు కాని ఈరోజు ఈవెనింగ్ పార్టీ మాత్రం కన్ఫాం అని గట్టిగానే చెప్పుకొచ్చాడు.

సో ఏదైనా విషయం జరిగినప్పుడు దాన్ని సంచలనంగా మార్చే వర్మ కొత్త అమెరికా ప్రెసిడెంట్ గురించి చెప్పిన ఈ ఆసక్తికర విషయాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.

Leave a Reply