రాధా సవాల్ కి వర్మ షాకింగ్ కౌంటర్..

0
234
varma shocking counter to radha

Posted [relativedate]

varma shocking counter to radha
వాడు,వీడు అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించిన వంగవీటి రాధా సవాళ్ల పై రామ్ గోపాల్ వర్మ కూడా షాకింగ్ కౌంటర్ ఇచ్చాడు.రంగాని గాంధీ మహాత్ముడిలా చూపించాలా?మదర్ థెరెసా లా సాత్వికుడు అని చెప్పాలా? మర్డర్ మాట పక్కనబెట్టి అయన కనీసం ఎవరినీ మొట్టికాయ కూడా వేయలేదని చెప్పాలా? చీమ కైనా హానీ చేయని గౌతమ బుద్ధుడిగా చూపాలా అంటూ వర్మ ప్రశ్నల వర్షం కురిపించాడు. రంగా గురించి వాస్తవాలే చూపమంటున్న రాధా కి రంగ,అయన భార్య గురించి అయన అభిమానులు వినడానికి,చూడడానికి ఇష్టపడని ఎన్నో విషయాలు డాక్యుమెంట్స్ రూపంలో తన దగ్గర ఉన్నాయని …రాధా వస్తే అవి చూపుతానని వర్మ చెప్పాడు.రాధా,రంగ గొప్పదనంలో .01 శాతం కూడా లేనందువల్లే రాధాకృష్ణ ప్రస్తుతం ఉన్న స్థానంలో వున్నాడని వర్మ ఎద్దేవా చేసాడు.మొత్తానికి ఎవరికీ దడవబోనని వర్మ మరోసారి నిరూపించుకున్నాడు.

మరోవైపు రంగా అభిమానులు,కుటుంబ సభ్యుల నుంచి వంగవీటి సినిమా మీద తీవ్ర అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ చేసిన ఓ ట్వీట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.రంగా వర్ధంతి సందర్భంగా వస్తున్న విమర్శల్ని దృష్టిలో పెట్టుకుని వర్మ తాజా ట్వీట్ చేశారు.రంగా ఆత్మ శాంతి తో వుండాలని కాకుండా తన అభిమానులకి వర్మ సినిమాలో తీసింది నిజమని చెప్పమని కోరుతున్నట్టు Rgv ట్వీట్ చేశారు.అంతటితో ఆగకుండా జై మోహన్ రంగా అని ట్వీట్ ని ముగించారు.

Leave a Reply