వర్మ సన్నీలియోన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ అదిరింది

148
Meri Beti Sunny Leone Banna Chaahti Hai
Spread the love

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

వివాదాలను పక్కకు పెడతానంటూ ప్రకటించి ట్విట్టర్‌ను వదిలేసిన వర్మ తాజాగా షార్ట్‌ ఫిల్మ్‌లు మరియు వెబ్‌ సిరీస్‌ సినిమాలను తెరకెక్కించే పనిలో పడ్డాడు. నిన్న హఠాత్తుగా మేరీ బేటీ సన్నీలియోన్‌ బన్‌ చహతాహై అనే షార్ట్‌ ఫిల్మ్‌ను రేపు విడుదల చేస్తానంటూ ప్రకటించిన వర్మ అందరిలో ఆసక్తిని రేకెత్తించాడు. అన్నట్లుగా వర్మ నేడు ఉదయాన్నే షార్ట్‌ ఫిల్మ్‌ను విడుదల చేశాడు. సన్నీలియోన్‌ పేరు టైటిల్‌లో ఉండగానే అంతా కూడా కాస్త మసాలా ఎక్కువగా ఉంటుందని ఆశించారు. అయితే అలాంటిది ఏమీ లేకుండా అందరిని ఆలోచింపజేసే విధంగా వర్మ షార్ట్‌ ఫిల్మ్‌ను తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటుంది.

కేవలం మూడు పాత్రల మద్య, 11 నిమిషాల పాటు సాగిన ఈ షార్ట్‌ ఫిల్మ్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. మూడు పాత్రలు కూడా విభిన్న తరహాలో ఎమోషన్స్‌ను కనబర్చుతూ నటించిన తీరు ఆకట్టుకుంది. ‘వంగవీటి’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన నైనా గంగూలీ ఈ షార్ట్‌ ఫిల్మ్‌లో నటించింది. తాను సన్నీలియోన్‌ తరహాలో పోర్న్‌ స్టార్‌ కావాలని కోరుకుంటున్నాను అంటూ అమ్మాయి తన తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వారు ఎలా రియాక్ట్‌ అవుతారు, ఆ సమయంలో వారి మద్య చర్చ ఎలా జరిగింది అనేదే షార్ట్‌ ఫిల్మ్‌. చిన్న బూతు సీన్‌ లేకుండా తల్లి, తండ్రి ఒక కూతురు మద్య ఈ షార్ట్‌ ఫిల్మ్‌ సాగింది. అకౌంటెంట్‌, సాఫ్ట్‌వేర్‌ జాబ్‌, గవర్నమెంట్‌ జాబ్‌, హౌస్‌ వైప్‌ ఎలాగో పోర్న్‌ స్టార్‌ కూడా అలాగే. అందులో వింతేం లేదని, దాన్ని తప్పుగా బావించడం తగదని, తాను పోర్న్‌ స్టార్‌గా అయ్యి తీరుతాను అంటూ ఆ అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. వర్మ ఈ షార్ట్‌ ఫిల్మ్‌ వల్ల కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా, ఎక్కువ శాతం మందికి మాత్రం ఈ షార్ట్‌ ఫిల్మ్‌ ఆలోచనాత్మకంగా ఉందని అనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here