తేరే అమ్మీ.. మేరే మమ్మీ

0
569

dishyum1
బాలీవుడ్ అందాల భామ పరిణీతి చోప్రా ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చే స్తోంది. 2014లో కిల్ దిల్ తర్వాత ఈ సుందరాంగి ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయలేదు. కేవలం తను సన్నబడ్డం కోసం నెలలు కాదు ఏళ్ల పాటు కష్టపడిన పరిణీతి.. ఇప్పుడు తన బాడీలో ఆ వేరి యేషన్ కంప్లీట్‌గా చూపిస్తోంది. వరుణ్ ధావన్‌కి జంటగా పరిణీతి చోప్రా నటించిన డిషూం మూవీకి సంబంధించిన సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు. ‘తేరే అమ్మీ.. మేరే మమ్మీ’ అంటూ మొదలయ్యే ఈ పాట.. ‘జానేమన్ ఆహ్..’ అంటూ మాస్ బీట్ తో రచ్చ లేపేలా డిజైన్ చేశారు.

అటు వరుణ్ ధావన్ అయినా.. ఇటు పరిణీతి అయినా కంప్లీట్ గా మాస్ అవతారంతో కుమ్మేసేందుకు తెగ ట్రై చేశారు. గెటప్పుల నుంచి స్టెప్పుల వరకు అంతా ఊరమాస్ చూపి ద్దామనే ప్రయత్నమైతే కనిపించింది కానీ.. టోటల్ గా సాంగ్ చూస్తుంటే మాత్రం అంత గొప్పగా అనిపించడం లేదు. ముఖ్యంగా మాస్ చూపించ డంలో వరుణ్ విఫలం అయితే.. ఆ మాస్ బీట్ ను తీసేందుకు వేసిన స్టెప్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పాట మొత్తంలో ఆడియన్స్ కి రిలీఫ్ పాయింట్ ఒకటే. అదేంటంటే పరి ణీతి చూపిస్తున్న కొత్త అందాలు. పైగా.. చివర్లో హీరోకి ఓ లిప్ లాక్ వేసింది లెండి. అది కూడా ప్రేక్షకులకు ఓ గిఫ్ట్ అనుకోవాల్సిందే.

Leave a Reply