ధావన్ లక్కీ.. యాక్సిండెంట్ అయినా

Posted October 10, 2016

  varun dhawan met accident

బాలీవుడ్ నటుడు వరుణ్‌ ధావన్ రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డాడు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే, వరుణ్‌ చిన్న గాయాలతో బయటపడినట్టు తెలుస్తోంది.

ఈ యాక్సిండెంట్ ని స్వయంగా చూసిన ఓ వ్యక్తి.. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టాడు. “వరుణ్ ధావన్ కారు జుహు 10వ రహదారి వద్ద మరో హోండా సిటీ కారును ఢీ కొట్టింది” అని పోస్ట్ చేశాడు. ఇది చూసి బాలీవుడ్ జనాలు షాకయ్యేలోపే.. దీనికి స్పందించారు వరుణ్. తన కారు ప్ర‌మాదానికి గురైన మాట వాస్త‌వ‌మేనని, అయితే త‌న‌కు గాని, వేరే కారు లో ఉన్న‌వాళ్ల‌కు గాని ఎటువంటి గాయాలు కాలేద‌ని క్లారిటీ ఇచ్చాడు. దీంతో.. ధావన్ యాక్సిండెంట్ మేటరు కూల్ గా మారిపోయింది. లేదంటే సోషల్ మీడియాలో వైరల్ అయ్యేదే.

For everyone asking everyone in my family is fine and no one is injured.thank you

SHARE