మహేష్ మెచ్చాడు వరుణ్ చేస్తున్నాడు..!

0
385

vt1416సూపర్ స్టార్ మహేష్ ఓ కథ నచ్చాడంటే కచ్చితంగా అందులో విషయం ఉన్నట్టే. అయితే కథ నచ్చినా చేయలేని పరిస్థితుల్లో ఓ సినిమా ఆఫర్ వదులుకున్నాడు. ఇప్పుడు అదే కథతో మెగా హీరో వరుణ్ తేజ్ సినిమా చేస్తున్నాడు. ఇంతకీ ఏ సినిమాకు ఈ వ్యవహారం అంతా నడిచింది అంటే శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ఫిదా మూవీకి అని తెలుస్తుంది. మంచి ఫాంలో ఉన్నప్పుడు కమ్ముల మహేష్ తో సినిమా తీస్తున్నాడని వార్తలు వచ్చాయి.

మహేష్ తో కథా చర్చలు కూడా జరిపాడు శేఖర్ కమ్ముల. అయితే ఆ డిస్కషన్ లో కథే ఫిదా మూవీ అట. మహేష్ నుండి ఫ్యాన్స్ యాక్షన్ మూవీస్ కోరుకుంటున్నారు. అందుకే పూర్తి క్లాస్ మూవీగా తీసిన బ్రహ్మోత్సవం ఘోరమైన ఫ్లాప్ చవిచూసింది. అయితే ఈ టైంలో మరో క్లాస్ మూవీ అంటే కష్టమే అని సినిమా కథ నచ్చినా సారీ అనేశాడట మహేష్. ఇక అదే కథతో శేఖర్ కమ్ముల వరుణ్ తేజ్ తో ఫిదా తీస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మహేష్ మెచ్చిన కథ అని తెలిసినప్పటి నుండి ఇంకాస్త ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Leave a Reply