అబ్బాయి కోసం బాబాయి వస్తాడా..?

Posted April 7, 2017

varun tej hopes on pawan kalyan for mister pramotionమెగా కాంపౌండ్ నుండి హీరోగా వచ్చిన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కి ఇప్పుడు క్రూసియల్ టైం నడుస్తుంది. ముకుంద..కంచె సినిమాలతో ఓకే అనిపించుకున్న వరుణ్ ‘లోఫర్’ మూవీ తో బొక్క బోర్ల పడ్డాడు. కమర్షియల్ హీరోగా ఎష్టాబ్లిష్ అవుదామనుకున్న వరుణ్ కి లోఫర్ మూవీ ఊహించని షాక్ ఇచ్చింది. అందుకే వరుణ్ తన మూవీ స్టొరీ సెలక్షన్ లో చాలా కేర్ తీసుకుంటున్నాడు,వరుస ప్లాప్ లతో సతమవుతున్న శ్రీను వైట్ల చెప్పిన స్టొరీ బాగా నచ్చడంతో ప్లాఫ్ డైరెక్టర్ అని తెలిసి కూడా వెంటనే శ్రీను వైట్ల మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడు ‘ మిస్టర్ ‘ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ మిస్టర్ మూవీ మీద వరుణ్ తేజ్- శ్రీను వైట్ల భవిష్యత్ ఆధారపడి ఉంది.

మిస్టర్ మూవీతో ఎలాగైనా హీరోగా సక్సెస్ కావాలనుకుంటున్నాడు వరుణ్ . ఈరోజు మిస్టర్ మూవీ ప్రీ-రిలీజ్ మూవీ ఫంక్షన్ జరగనుంది. ఈ ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ వస్తే తన మూవీ కి ప్లస్ అయ్యిద్ది అని వరుణ్ ఆలోచన, ఈ విషయాన్ని తన తండ్రి నాగబాబు కి చెప్పాడు. నాగబాబు కూడా ఈ విషయం మీద ఆలోచించి పవన్ ని తెచ్చే పనిలో ఉన్నాడు. ఈనెల 13న రిలీజ్ కానున్న ఈ మూవీకి క్రేజ్ తీసుకురావడాని పవన్ ని, మెగా ఫ్యామిలీ హీరోలని వాడుకోవాలని డిసైడ్ అయ్యాడట నాగబాబు.ఫంక్షన్ లకి దూరంగా ఉండే పవన్ మరి ఈ నిర్ణయానికి ఎలా స్పందిస్తాడో చూడాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ ఫంక్షన్ కి రాకపోతే ,పవన్ కళ్యాణ్ – వరుణ్ తేజ్ తో కలసి ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూ అయినా ప్లాన్ చేయాలి అని చూస్తున్నాడంట నాగబాబు. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన కాటమరాయుడు మూవీ ప్రమోషన్ పెద్దగా పట్టించుకోని పవన్ కళ్యాణ్ ఇప్పుడు మిస్టర్ కి హెల్ప్ చేస్తాడా లేదా అనేది చూడాలి.

SHARE