ఎన్ కౌంటర్ పై వైసిపి రియాక్షన్..

 Posted October 28, 2016

vasireddy padma demand enquiry on malkangiri maoists encounter
ఆంధ్ర ..ఒడిస్సా సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై వైసీపీ కర్ర విరక్కుండా పాము చావకుండా ఓ ప్రకటన చేసింది.ఎన్ కౌంటర్ పై విచారణకి డిమాండ్ చేస్తూనే …హింసాయుత తీవ్రవాదానికి తాము వ్యతిరేకమని ఆ పార్టీ స్పష్టం చేసింది.వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఎన్ కౌంటర్ ఎపిసోడ్ మీద పార్టీ వైఖరి వివరించారు.

మల్కన్ గిరి, బలిమెల ఎన్కౌంటర్లపై మీడియా, ప్రజాసంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని ఆమె అన్నారు. ఎన్కౌంటర్ వాస్తవం కాదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోందని… అయితే డీజీపీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది ఖచ్చితంగా ఎన్కౌంటరే అని చెబుతోందని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని ఆమె డిమాండ్ చేశారు. అందరూ కోరుకున్నట్టుగా రాష్ట్రప్రభుత్వం విచారణకు ఆదేశించాలని వాసిరెడ్డి పద్మ అన్నారు. కాగా ఎన్కౌంటర్లో 30మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.

SHARE