Posted [relativedate]
ప్రజాభిమానం ప్రాతిపాదికగా ఓ సంస్థ వెల్లడించిన సర్వే వివరాలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి మింగుడుపడటం లేదు.వీడీపీ అసోసియేట్స్ అనే సంస్థ ట్విట్టర్ ద్వారా తాము నిర్వహించిన సర్వే ఫలితాలు బయటపెట్టింది.జనంలో ఉన్న పాపులారిటీ ని బెంచ్ మార్క్ గా తీసుకున్న ఈ సర్వే లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా ..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.సర్వే ల ద్వారా సొంత పార్టీ నేతలు,కార్యకర్తలకి ఝలక్ ఇచ్చే బాబుకి తాజా ఫలితాలతో అలాంటి అనుభవమే ఎదురైంది.వీడీపీ అసోసియేట్స్ ముఖ్యమంత్రుల పనితీరు,ప్రజాదరణపై వెల్లడించిన వివరాలు మీ కోసం ..
1.కె.చంద్రశేఖరరావు …87
2.శివరాజసింగ్ చౌహన్ …85
3 . మమతా బెనర్జీ ……79
4. జయలలిత ……..75
5.దేవేంద్ర ఫడ్నవిస్ ..62
6.నితీష్ కుమార్ ……61
7. వసుంధర రాజే …58
8.చంద్రబాబు ……58
పాయింట్స్ వారీగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరు ఇది.7,8 స్థానాల్లో వున్నవారికి ఒకే మార్కులు వచ్చినా కొన్ని అంశాల ప్రాతిపదికగా రాజే తర్వాతి స్థానమే బాబుకి దక్కింది.కనీసం కెసిఆర్ కి పోటీ ఇచ్చే స్థాయిలో కూడా బాబు లేకపోవడం టీడీపీ వర్గాలకి ఇబ్బందికర అంశమే.