టీడీపీ,వైసీపీ కి చెమటలు పట్టించిన సర్వే ..

 Posted October 31, 2016

vdp associate survey ruling parties dominates telugu states
సహజంగా ఒక సర్వే అధికార పార్టీకి షాక్ ఇస్తే ..ప్రతిపక్ష పార్టీకి స్వీట్ న్యూస్ పంచుతుంది.ఇంకో సర్వే అధికార పార్టీకి ఉత్సాహమిస్తే …ప్రతిపక్షానికి చుక్కలు చూపిస్తుంది.ఈ రెంటికీ భిన్నంగా ఒకేసారి భిన్న ఫలితాలతో వీడీపీ అసోసియేట్స్ ఏపీలో అధికార,ప్రతిపక్షాలకు చెమటలు పట్టించింది.ముఖ్యమంత్రుల ప్రజాదరణ ప్రకారం ర్యాంకులు ఇచ్చిన ఆ సంస్థ మొదటి స్థానాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కి ప్రకటించింది.ఆ రేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ఆ సర్వే సహజంగానే టీడీపీ శ్రేణులకు మింగుడు పడలేదు.వైసీపీ మాత్రం చంకలు గుద్దుకుంది .దేశం నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఓ అడుగు ముందుకేసి సర్వే చేసిన సంస్థను తప్పుబట్టారు.

ఈ పరిస్థితిలో ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలొస్తే అన్న సర్వే ఫలితాలని కూడా వీడీపీ సంస్థ విడుదల చేసింది.దాని ప్రకారం కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు రెండు మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకుంటాయని ఆ సంస్థ తేల్చింది .కాకుంటే 2014 ఎన్నికలతో పోల్చుకుంటే బీజేపీ ,టీడీపీ కూటమికి రెండు లోక్ సభ స్థానాలు తగ్గుతాయని …వైసీపీ కి ఆ రెండు స్థానాలు పెరగొచ్చని అభిప్రాయపడింది.ఈ ఫలితం సహజంగానే బాగా బలం పుంజుకున్నామని భావిస్తున్న వైసీపీ కి ,తమకి ఎదురు లేదని అనుకుంటున్న టీడీపీ కి ..రెండు పార్టీలకి చెమటలు పట్టించింది .కాదంటారా?

SHARE