వెలగపూడి కి మరో  డెడ్ లైన్… .

velagapudi deadline
నెలాఖరులోగా మొత్తం సచివాలయం కొత్త రాజధానిలోని అమరావతి రాజధాని వెలగపూడి తాత్కాలిక సచివాలయానికి తరలివెళ్లేందుకు ప్రభుత్వం కొత్త గడువు ప్రకటించింది. మొత్తం తరలింపు ప్రక్రియ ఈనెల 29వ తేదీకి పూర్తి కావాలని సష్టం చేసింది. ఆ సమయానికి అంతా వెళ్లాలని నిర్దేశించింది తమ తమ శాఖల్లోని ఉద్యోగులు సహా వెలగపూడిలో కార్యాలయ వసతిని స్వాధీనం చేసుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియలో మంత్రులతో కూడా చర్చించి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటివరకు ఏయే శాఖాధిపతుల కార్యాలయాలు రాజధానికి తరలివెళ్లాయన్న కోణంలో ముఖ్యమంత్రి పేషీ వివరాలు సేకరిస్తోంది. గుంటూరు, విజయవాడ, అమరావతి ప్రాంతాలకు ఏయే శాఖాధిపతుల కార్యాలయాలు వెళ్లాయి? వాటి చిరునామాలు, ల్యాండ్‌ ఫోన్‌ నంబర్లు, ఇతర వివరాలు అరదించాలని సిఎంఓ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్ర ప్రత్యేక ప్రోఫార్మాతో ఈ ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్‌ సచివాలయం నుంచి వివిధ శాఖల తరలింపు నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన తేదీల్లో తరలింపు పూర్తికానందున మళ్లీ ఈనెల 21, 29 తేదీల్లో ఉద్యోగుల తరలివెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇరదులో భాగంగా విజిలెన్స్‌ కమిషన్‌, రోడ్లు భవనాల శాఖలు ఈ నెల 21వ తేదీన తరలివెళ్లాలని, 29వ తేదీన మిగిలిన శాఖలన్నీ వాటికి కేటాయించిన భవనాల్లోకి చేరుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే ఆయా భవనాల్లోకి ఏయే శాఖలు వెళ్లాలన్న దానిపై షెడ్యూల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే జాబితాలో స్వల్ప మార్పులు చేస్తూ ఈ తాజా సర్కులర్‌ జారీ చేశారు.గత నెల 29న నాలుగు సచివాలయ శాఖలు వెలగపూడికి తరలివెళ్లాయి. కానీ నిర్మాణాలు పూర్తికాక పోవడంతో ఆ శాఖల ఉద్యోగులంతా కేవలం కొబ్బరికాయ కొట్టి చేసిన ప్రారంభోత్సవానికే పరిమితమయ్యారు. అదే రోజు హైదరాబాద్‌ వచ్చేశారు. ఇప్పుడు కూడా మొత్తం అన్ని శాఖలు వెళ్లిపోవాలని తీసుకున్న నిర్ణయంపై కూడా చర్చలు సాగుతున్నాయి. ఈ తరలింపు కూడా లాంఛన ప్రారంభోత్సవానికే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు అధికారులే అంటున్నారు. భవన నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో తాజా తరలిరపు షెడ్యూల్‌ కూడా నామమాత్రంగా మారిపోయే అవకాశాలున్నాయని వారభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here