నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవనాలు లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి ఇది తాత్కాలిక సచివాలయమే అయినప్ప టికీ, భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని శాశ్వత ప్రాతిపదిక నిర్మాణాలు చేపడుతున్నారు. కార్పొరేట్ కార్యాలయాల తరహాలో ఆధునిక సౌకర్యాల కల్పనతోపాటు అత్యంత కట్టుదిట్టమైన భద్రతాచర్యలను చేపడుతున్నారు. జాతీయ భవనాల నిబంధనలఅనుగుణంగా నిర్మిస్తున్నారు. ఏ ప్రమాదం సంభవించినా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సచివాలయ ప్రాంగణంలోకి వచ్చే ప్రతివాహనాన్ని తనిఖీ తర్వాతే లోపలికి అనుమతించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇంజినీర్లు తెలిపారు.
గోడలకు సాధారణ ఇటుకలు కాకుండా ఏసీసీ బ్లాక్స్ ఉపయో గిస్తున్నారు. ఇవి కొంత ఖర్చుతో కూడుకున్నప్పటికీ అనేక ఉపయోగాలు ఉన్నాయని ఇంజినీర్లు చెబుతున్నారు. బరువు తక్కువగా ఉండటంతో స్తంభాల ఆధారిత నిర్మాణాలకు అనుకూలం. ఇవి ఒక గది నుంచి మరో గదికి శబ్దం, తడి రాకుండా పనిచేస్తాయి. అధికారుల కోసం ప్రత్యేకమైన అద్దాలతో క్యాబిన్లు ఏర్పాటు చేస్తున్నారు. సెక్షన్ ఉన్నతాధికారికి ప్రత్యేక క్యాబిన్ నిర్మిస్తున్నారు. ఇతర ఉద్యోగులకు కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న తొలి అంతస్థులో క్యాబిన్లకు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు అమర్చనున్నారు. ఉద్యోగుల విధులు నిర్వహించే ప్రాంతాల్లో అప్రమత్తం చేయడానికి వీలుగా సమాచార వ్యవస్థ సౌకర్యం కల్పించారు.
అత్యాధునికమైన మరుగు దొడ్లు ఏర్పాటుచేస్తున్నారు. ఒక్కొక్క భవనంలో సుమారు 150 వరకు శీతలీకరణ యంత్రాలు ఏర్పాటు చేయను న్నారు. ప్రతి భవనం పరిధిలో కేంద్ర శీతలీకరణ యూనిట్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి చల్లనిగాలిని పంపే ఏర్పాటు చేస్తారు. శీతలీకరణ యంత్రాలను అవసరం మేరకు మాత్రమే ఉపయోగించుకునేలా ప్రత్యేక ఏర్పాటు ఉంది. భవనంలో ఎంతమంది ఉన్నారో వారికి ఎంత అవసరమో ఆమేరకు శీతలీకరణ యంత్రాలు పనిచేసే ఏర్పాటు ఉంది. ప్రతి భవనంలో అగ్నినిరోధకానికి వీలుగా నీటి పైప్లైన్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి నీటిని పంపింగ్ చేయడానికి 24 గంటలు మోటారు అందుబాటులో ఉం టుంది. ప్రత్యామ్నాయంగా జనరేటర్ కూడా సమకూ రుస్తారు. భవనంలో ఎక్కడెనా పొగవచ్చినా వెంటనే అప్రమత్తం చేసే వ్యవస్థను ఏర్పాటు చేశారు. అలాగే స్లాబుకు ఉపయోగిస్తున్న ఇనుప కడ్డీలకు తడి చేరి తుప్పు పట్టకుండా వర్మీక్యూలేట్ పెయింట్ చేస్తున్నారు. 4000 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రతలో కూడా రెండు గంటల పాటు ఇనుము కరగకుండా ఇది అడ్డుకుంటుంది. దీంతో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా నిరోధించవచ్చు. భవనాల భద్రత పెరగ డంతోపాటు మన్నికకాలం పెరుగుతుంది.