వెలగపూడిలో కొత్త సచివాలయం ప్రారంభం.

0
447

  velagapudi secretariat opening

వెలగపూడిలో కొత్త సచివాలయం ప్రారంభానికి  ఉద్యోగులు ఉత్సాహంగా తరలివచ్చారు.. వేదమంత్రాలు, బాజా బజంత్రీల నడుమ కోలాహలంగా సచివాలయం ప్రారంభం జరిగింది.  2.59 నిమిషాలకు పంచాయితీరాజ్ శాఖా మంత్రి అయ్యన్న పాత్రుడు చేతులమీదుగా సచివాలయం ప్రారంభోత్సవం జరిగింది. అయ్యన్న పాత్రుడు కొబ్బరికాయకొట్టి, రిబ్బను కటింగ్ చేసి ఐదవ బ్లాక్ ను ప్రారంభించారు. సచివాలయం ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. జనం వేలకువేలు తరలి వచ్చారు. వర్షం పడుతున్న లెక్క చేయకుండా  సచివాలయాన్ని చూడటానికే చాలా మంది వచ్చారు. చుట్టుపక్కల ప్రాంతాలవారే కాదు, హైదరాబాద్ నుంచి కూడా కేవలం కొత్త సచివాలయాన్ని సందర్శించడానికి వచ్చినట్లు చెప్తున్నారు.

Leave a Reply