Posted [relativedate]
వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరుతున్నానని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ప్రకటించారు. టీడీపీ, బీజేపీ నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చక పోగా సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే నిర్ణయాలను తీసుకోవటం వల్లే తాను పార్టీని వదిలేయాల్సి వస్తోందని చెప్పారు .
టీడీపీ దురాగతాలకు పాల్పడుతున్నదని, ఇదేమని ప్రశ్నిస్తే తనపై నిందలు మోపుతున్నారన్నారని ఆయన ఆరోపించారు. భావప్రకటన స్వేచ్ఛలేని పార్టీలో ఇమడలేక బయటకు వస్తున్నానని వెల్లంపల్లి వెల్లడించారు. బీజేపీకి రాష్ట్రంలో మనుగడలేదని , బీజేపీ మంత్రుల మాటకే విలువ లేదని, ఆ పార్టీ మంత్రుల శాఖలను ముఖ్యకార్యదర్శులే కంట్రోల్ చేస్తున్నారన్నారు. బాబు అసమర్థవల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిధులు రావటంలేదని శ్రీనివాసరావు విమర్శించారు