బాబుతో వెంకయ్య రాయబారమేంటి ?

0
387

  venakaiah naidu meet chandrababu special status reason
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఆశలు మిణుకుమిణుకుమంటున్న తరుణంలో వాటిపై కేంద్రం నీళ్లు చల్లినట్టేనని తెలుస్తోంది.హోదాకి మించిన మేలు చేసే ప్యాకేజ్ కే ప్రధాని నరేంద్ర మోడీ ,బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మొగ్గు చూపినట్టు సమాచారం.ఈ అంశంలో అటుఇటుకాకుండా వున్న మోడీని అమిత్ ఒప్పించినట్టు జాతీయ పత్రికలు చెప్తున్నాయి.నిర్ణయం తీసుకుంది మోడీ,అమిత్ అయితే దానికి ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పించే పని మాత్రం ట్రబుల్ షూటర్ వెంకయ్య మీదే పెట్టారు.

ఢిల్లీ నుంచి వెంకయ్య ఆంధ్ర ప్రయాణం వెనుక రహస్యమిదే.ఈ విషయం తెలిసే పార్టీ వర్గాలతో చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.కేంద్రం ఇవ్వజూపుతున్న ప్యాకేజీ .హోదా డిమాండ్ …రాజకీయ పరిణామాలు …అన్ని ఈ కాన్ఫరెన్స్ లో చర్చకి వచ్చాయి.ఒక్కసారి ప్యాకేజ్ కి సై అంటే ఎదురయ్యే పరిస్థితుల్ని కూడా అంచనా వేశారట .కానీ హోదా సెంటిమెంట్ తో రాజకీయం గా ఎంతోకొంత నష్టం తప్పదని బాబు భావిస్తున్నారు .దాన్ని అధిగమించాలంటే ప్యాకేజ్ అయినా భారీగా ఉండాలని అయన కోరుకుంటున్నారు.వెంకయ్యతో బాబు అదే చెప్పబోతున్నారు.దానికి కేంద్రం స్పందనతో ఈ ఎపిసోడ్ ఓ ముగింపుకి వస్తుంది..అది ఏపీ ప్రజల పాలిట దుఃఖంతమో,సుఖాంతమో చూడాలి.

Leave a Reply