పవన్ కి జవాబిచ్చే పనిలేదా?

  venkaiah counter attack pawan kalyan
పవన్ పేరు ఎత్తకుండానే కాకినాడ సభలో అయన చేసిన విమర్శలకి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కౌంటర్ వేశారు.ఏపీ అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్న తనపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడే వాళ్లకి జవాబు చెప్పాల్సిన పనిలేదని అయన అన్నారు.నేతలకి కాకుండా ప్రజలకి మాత్రమే తాను సమాధానమిస్తానని వెంకయ్య స్పష్టం చేశారు.వ్యక్తిగత విమర్శలకి స్పందించే అలవాటు తనకి లేదన్నారు.రాజకీయ పరిజ్ఞానం వున్నవారికి ఈ విషయం తెలుసంటూ పవన్ పై పరోక్ష కౌంటర్ వేశారు.

మోడీ,చంద్రబాబు …లేదా నేను పదవి నుంచి దిగిపోతే చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారని …అప్పుడు పదవులు దక్కుతాయని వారి ఆశని వెంకయ్య అన్నారు.రాజ్యసభలో ఏపీ కోసం పోరాడిన విషయాన్ని ఒప్పుకున్న వెంకయ్య ..ఇప్పుడు ప్యాకేజ్ వల్ల అంతకన్నా ఎక్కువ లబ్ది చేకూరుతుందని చెప్పారు.ఇప్పుడు హోదా అని పోరాడే వాళ్ళు ఆ రోజు ఎక్కడి కెళ్లారో చెప్పాలని నిలదీశారు.ఎవరెన్ని విమర్శలు చేసినా వెనుకడుగు వేయబోనని వెంకయ్య కుండ బద్దలు కొట్టారు.

SHARE