వెంకయ్య జవాబు చెప్పని ప్రశ్నలు ?

 venkaiah naidu abn live chat not answered questions list
ప్రత్యేక హోదా డిమాండ్ తో గళమెత్తిన జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ పై యుద్ధానికి బీజేపీ సిద్ధమైపోయింది.ఆ యుద్ధ వ్యూహంలో ఇప్పటిదాకా కేంద్రం రాష్ట్రానికి చేసిన ..చేస్తున్న సాయంపై విరివిగా ప్రచారం చేయడానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు.పవన్ పై వ్యక్తిగత విమర్శల జోలికి అంత తేలిగ్గా వెళ్లకూడదని కూడా హైకమాండ్ చెప్పింది.కానీ కొత్త ఉత్సాహంతో ఏపీ వ్యవహారాల ఇంచార్జి సిద్ధార్ధనాధ్ సింగ్ ముఖ్యమంత్రి పదవిపై కన్నేసి పవన్ ఇలా వ్యవహరిస్తున్నారని అన్నారు.కేంద్ర ప్యాకేజ్ ని అర్ధం చేసుకొంటే అన్ని సందేహాలు తొలిగిపోతాయని అయన పవన్ కి సూచించారు.

ఇక ABN బిగ్ డిబేట్ కి వచ్చిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆద్యంతం తాము రాష్ట్రానికి చేస్తున్న సాయం గురించి చెప్తూనే వున్నారు.పవన్ విమర్శల్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ …వారి కోసం కాదు ప్రజలకోసమని వివరణ ఇచ్చారు .కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తుందన్న ఆరోపణలు నిజం కాదని చెప్పేందుకు ప్రయత్నించారు.పవన్ పై నేరుగా విమర్శ చేయకుండా విభజన సమయం,ఆ తరువాత కాంగ్రెస్ వైఖరిని నిలదీశారు.ఆ సమయంలో రాష్ట్రం కోసం తానెలా కష్టపడింది చెప్పడానికి ప్రాధాన్యమిచ్చారు.

అన్ని సందేహాలకు చక్కటి వివరణ ఇచ్చిన వెంకయ్య ఒక్క విషయంలో మాత్రం సూటిగా సమాధానమివ్వలేకపోయారు.హోదా వల్ల పెద్దగా ప్రయోజనం లేదనుకున్నపుడు నాడు రాజ్యసభలో 10 ఏళ్ళు ఇవ్వాలని ఎందుకు డిమాండ్ చేశారు ?బీజేపీ మేనిఫెస్టోలో ఆ అంశాన్ని ఎందుకు చేర్చారు? ఈ రెండు ప్రశ్నల విషయంలో మాత్రం వెంకయ్య ఎదురుదాడి చేయలేకపోయారు.పవన్ ప్రాధానంగా లేవదీస్తున్నవి కూడా ఈ ప్రశ్నలే.హోదా,ప్యాకేజ్ గురించి వెంకయ్య వివరణ చూశాక ఆంధ్రాకి మేలు జరుగుతుందన్న నమ్మకం కలిగినా …2014 లో కేవలం ఓట్ల కోసమే బీజేపీ హోదా అస్త్రాన్ని వాడుకుందని అనిపిస్తోంది.కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా ఓటు రాజకీయాల కోసమే సాధ్యాసాధ్యాలు పట్టకుండా హోదా నాడు హోదా డిమాండ్ చేసింది నిజం..నిష్ఠుర సత్యం.

SHARE