Posted [relativedate]
తమిళ రాజకీయాల్లో తెలుగు నేతల జోక్యం ఎక్కువగానే వుంది ..యూ పీ ఏ హయాంలో హోమ్ మినిస్టర్ గా కీలక పాత్ర పోషించిన చిదంబరం ఏమితక్కువ కాదు పరోక్షం గా ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణా గా విడిపోవడానికి ఆయన వంతు పాత్ర కూడా ఎక్కువే..కానీ అధికారం లో ఉన్న.పార్టీ అందునా మంత్రి కావడం తో సమైక్య రాగం ఊపందుకోలేదు. ఇదిలా ఉండగా తెలంగాణా రాష్ట్రాన్నీ ప్రకటిస్తే తరువాత రాష్ట్రము లో ,కేంద్రం లో అధికారం మరో సరి మనది అవుతుందని కాంగ్రెస్ పార్టీ అది నేత్రి సోనియా గాంధీకి సలహా ఇచ్చింది కూడా చిదంబరమే …ఇలా తెలుగు వారు రెండుగా విడిపోవడానికి కీలక పాత్ర పోషించింది “చిదంబర”రహస్యం.
ప్రస్తుతం తమిళ నాడు ముఖ్య మంత్రి జయలలిత హఠాన్మరణం వల్ల.తమిళ నాడు రాజకీయం లో పెను మార్పులు వచ్చే అవకాశాలు స్పష్టం గా కనిపిస్తున్నాయి. ప్రత్య్సర్ధి కరుణా నిధి కూడా ఈరోజే రేపా అనే లనే వుంది అయన ఆరోగ్యం. బద్ద శత్రువులిద్దరు ఆరోగ్యం కోసం పోరాడుతున్నారు ఒకరు ఆల్రెడీ సెలవు తీసుకున్నారు ..సరిగా ఇదే సమయంలో కేంద్రం లో అధికారం లో ఉన్న భారతీయ జనతా పార్టీ తమిళ రాజకీయాలపై ద్రుష్టి పెట్టింది. జయ లలిత ఆరోగ్యం బాగాలేని నటి నుంచి పరిస్థితుల్ని గమనిస్తున్న కేంద్రం సైలెంట్ గా పావులు కదుపుతూ వస్తోంది . అందులో భాగం గానే ప్రత్యామ్న్యాయ ముఖ్య మంత్రి గా పన్నీర్ సెల్వాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఇదంతా కేంద్ర మంత్రి గా ఉన్న వెంకయ్య నాయుడు , గవర్నర్ విద్యాసాగర్ రావు లే బాధ్యత తీసుకున్నారు. మొత్తంగా చెప్పాలంటే తమిళ రాయకీయానికి నాధుడు లేక వైధవ్యం లో ఉందనే చెప్పాలి …విడ తీసిన పాపం ఊరికే పోదన్నట్టు గా ఇప్పుడు తమిళుల పరిస్థితి అగమ్య గోచరం గా వుంది .
**శశి కళను అన్నాడిఎమ్‌కె ప్రధాన కార్యదర్శిగా నియ మించేందుక్కూడా పక్కా వ్యూహం రూపొందించి అమలు చేసిందివీరిద్దరే.
**. ఈ లోగా పరిస్థితుల్ని వీరిద్దరు తమ అదుపులోకి తెచ్చుకున్నారు
** బిజెపి తంబిదురైను గద్దెనెక్కించాలని ప్రయత్నించింది. ఈ బాధ్యతను కూడా ఆ పార్టీ వెంకయ్యకే అప్పగించింది.
**తొలుత శశికళను ఒప్పించి అనంతరం పన్నీరుకనుకూలంగా పరిస్థితిని వీరే మార్చగలిగారు. ఇప్పుడే కాదు.. భవిష్యత్‌లోనూ అటు శశికళ, ఇటు పన్నీర్ ఇద్దరూ త మ పట్టుదాటిపోకుండా పక్కా వ్యూహంతో వ్యవహరించారు.
**ప్రత్యర్థి డిఎమ్‌కెను అదుపు చేస్తూ ఎఐడిఎమ్‌కెపై పరోక్ష పట్టు బిగించారు. అలాగే ప్రభుత్వం బీజేపీ కనుసన్నల్లో మెలిగేలా వీరిద్దరే ప్రణాళికలు అమలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ విభజనకు కారకుల్లో తమిళుడైన చిదంబరం విడిపోతే దక్షిణాదిన తమిళుల ఆధిపత్యం కొనసాగుతుందన్న విశ్వాసమే ఆయన్నీవిధంగా పురికొల్పిందన్న ప్రచారముంది. అప్పట్నుంచి చిదంబరాన్ని సీమాంధ్రులు శతృవుగానే భావిస్తున్నారు. తమకు తమిళుడు కీడు చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటిదిప్పుడేకంగా తమిళ రాజకీయాల్నే తెలుగునేతలు ఒడిసి పట్టుకోగలిగారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.మొత్తానికి తెలుగోళ్ల ఇగో చల్లబడింది అనే చెప్పాలి.