కూడికల్లో వెంకయ్య …

 venkaiah naidu announced budget plan
ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా విషయంలో పెద్దగా నోరు తెరవని కేంద్ర మంత్రి వెంకయ్య ప్యాకేజ్ తర్వాత గొంతు విప్పారు.జైట్లీ ప్రకటన సమయంలో అంకెల జోలికి వెళ్లని ఆయన తాజాగా లెక్కల మాస్టర్ అయిపోయారు.ఏపీ కి రెండేళ్లలో కేంద్రం ప్రకటించిన ప్రోజెక్టుల విలువని కూడి మరీ ఆ విలువ 2 లక్షల 29 వేల కోట్లని తేల్చారు.వెంకయ్య చెప్పిన కూడికలు ఇలా వున్నాయి.
రాష్ట్రము లో ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్ట్ ల గురించి వెంకయ్య లెక్కల్లో …

పెట్రోలియం ప్రాజెక్టులు..52,120 కోట్లు
జాతీయ రహదారుల నిర్మాణం..65,000 కోట్లు
పోలవరం ప్రాజెక్టుకి ….15,850 కోట్లు
విద్యా సంస్థలు ….5,190 కోట్లు
జాతీయ,ఇతర సంస్థలు…1030 కోట్లు
రక్షణ సంస్థలు….6266 కోట్లు
పట్టణాభివృద్ధి,గృహ నిర్మాణం …4,110 కోట్లు
నౌకాయాన ప్రాజెక్టులు…3 ,465 కోట్లు
వైద్య ఆరోగ్య శాఖ ఆస్పత్రులు,కాలేజీలు ..1740 కోట్లు
విద్యుత్ ప్రాజెక్టులు….328 కోట్లు
విమానాశ్రయాలకు …..303 కోట్లు
రైల్వే ప్రాజెక్టులు…..3 ,808 కోట్లు
వాణిజ్యం,పరిశ్రమలు ….3 ,078 కోట్లు
ఐటీ,టెలి కం …..357 కోట్లు
పర్యాటక రంగం …131 కోట్లు
ఇతరత్రా ….102 కోట్లు
మొత్తం…..1,62,878 కోట్లు
రాబోయే ప్రోజెక్టుల వివరాలు
Rinl ,విశాఖ స్టీల్ ప్లాంట్ ….38,500 కోట్లు
విశాఖ మెడ్ టెక్ పార్క్ ….20,000 కోట్లు
అమరావతికి hudco ఋణం…7,500 కోట్లు
ఏపీ గ్రీన్ ట్రాన్స్మిషన్ కారిడార్ కి రుణాలు …520 కోట్లు

వెంకయ్య గారు కూడికలు భలే వేశారు .బీహార్ లో మోడీ కూడా పెద్దగా నిధులు ఇవ్వకుండా ఇలాగే కూడికలేసి పెద్ద ప్యాకేజ్ అంటూ ఎంత నాటకీయంగా ప్రకటించారో చూశాం.అక్కడి ఫలితము తెలుసుగా ..అయినా ఇవన్నీ ఎప్పటికి పూర్తి అవుతాయో చెప్పడానికి కేంద్రమే ధైర్యం చేయలేకపోతే ..ఇక ప్రజలు మరో ప్రకటన్ని ఎలా నమ్ముతారు? పార్లమెంట్ లో ప్రధాని ప్రకటనకు విలువ లేకుండా చేసి జనం నమ్మని పరిస్థితి ఎవరు తెచ్చుకున్నారో ఢిల్లీ పెద్దలే ఆలోచించుకోవాలి.

SHARE