వెంకయ్య ప్రశ్నకు నవ్వే ఆ ఎమ్మెల్యే సమాధానం ..

   venkaiah naidu asked ravi about addanki fights between balaram ravi kumar
ప్రకాశం జిల్లా తెలుగుదేశం రాజకీయాలు ఎంత హాట్ హాట్ గా సాగుతున్నాయో అందరికీ తెలిసిందే.అద్దంకి నియోజకవర్గం కేంద్రంగా కరణం,గొట్టిపాటి వర్గాల మధ్య కాక ఇంకా తగ్గలేదు.అధిష్టానం కూడా చెప్పి చెప్పి విసిగిపోయిందో ..లేక కాలంతోపాటు అన్నీ సర్దుకుపోతాయనుకుంటుందో …అదీకాక సమయం చూసి నిర్ణయం తీసుకుందామనుకుందో …ఎవరికీ అర్ధం కావడం లేదు ..ఈ పరిస్థితుల్లో ప్రకాశం జిల్లా దేశం ఎమ్మెల్యేలు సాగర్ నీటి విషయమై ఆ శాఖ మంత్రి దేవినేని ఉమని కలవడానికి విజయవాడ వచ్చారు .జిల్లా కి రావాల్సిన నీటిని వినుకొండ ఎమ్మెల్యే తమ ప్రాంతం కోసం అక్రమంగా తరలిస్తున్నారని మంత్రికి చెప్పారు.

ఉమా దగ్గరికి వచ్చిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ మిగిలిన ఎమ్మెల్యేలతో కలిసి విజయవాడలో ఉన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుని మర్యాద పూర్వకంగా కలిశారు.కుశలప్రశ్నలయ్యాక వెంకయ్య చొరవ తీసుకొని రవి అన్నీ సర్దుకున్నాయా అని అడిగారు.అది బలరాం తో ఉన్న గొడవల గురించే అని అర్థమైనా రవి ఏమీ చెప్పకుండా నవ్వేసి వూరుకున్నారట.ఇంతలో జిల్లా దేశం అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ కలగచేసుకొని చిన్న చిన్న సమస్యలున్నా సర్దుకుపోతాయని చెప్పారట..అయితే రవి నవ్వుకున్న అర్ధం ఏంటో రాజకీయ దురంధరుడు వెంకయ్యకి తెలిసిపోయివుండొచ్చు ..కానీ జిల్లాదేశం వర్గాలు ఆ నవ్వుకి అర్ధం వెతికే పనిలో పడ్డాయి.

SHARE