ఆ ఇద్దరి నేతల మాటలకి సెన్సార్ కావాలి ..

0
368

  venkaiah naidu narayan speech need censor
ఒకరు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ..మరొకరు సిపిఐ అగ్రనేత నారాయణ..ఇద్దరూ ఆయా పార్టీలకి మూలస్థంభాల్లాంటి వాళ్ళు .అలాంటి నేతల భాష కాస్త హద్దులు దాటింది.హోదా విషయంలో బీజేపీ వైఖరిని తప్పుబడుతూ నారాయణ తొలుత దూకుడుగా మాట్లాడారు.అప్పుడో మాట ఇప్పుడో మాట మాట్లాడుతున్న వెంకయ్య పంచె ఊడదీస్తామని అన్నారు.ఆ భాష సరిగా లేదంటూనే వెంకయ్య కౌంటర్ ఇచ్చారు .

అయినా పంచలూడదీసే ఆసక్తి ఎందుకో అంటూ నారాయణ మీద వేసిన సెటైర్ కి అంతా పగలబడి నవ్వారు.దీంతో నారాయణ మళ్లీ వెంకయ్యని టార్గెట్ చేశారు.ఇప్పటిదాకా వెంకయ్యని అతిగా అంచనా వేశామని…అయితే ఆయనలో గానీ ..అయన పంచలోగానీ ఏమీ లేదని అర్థమైందని నారాయణ ఇంకాస్త ముందుకెళ్లారు.వయసు పరంగా,అనుభవం పరంగా,పదవీ బాధ్యతల పరంగా పెద్దవాళ్ళైన ఆ ఇద్దరి మాటలకి సెన్సార్ అవసరం పడింది.కాదంటారా?

Leave a Reply