బెజవాడలో వెంకయ్యకి పూలు..తిట్లు

  venkaiah naidu received by tdp bjp politicians and opposition parties scold
ప్రత్యేకహోదా పక్కనపెట్టి ఆంధ్రాకి ప్యాకేజ్ ప్రకటన చేశాక కేంద్రమంత్రి వెంకయ్య తొలిసారి బెజవాడ వచ్చారు.ఈ సారి టూర్ లో ఆయనకి రెండు భిన్నమైన అనుభవాలు ఎదురయ్యాయి.గన్నవరం విమానాశ్రయం నుంచి బయటకి రాగానే బీజేపీ,టీడీపీ నేతలు ఆయనకి ఘన స్వాగతం పలికారు.పెద్దఎత్తున పూలు చల్లుకుంటూ,జై జై నినాదాలు చేస్తూ విజయవాడకి ర్యాలీగా బయలుదేరారు.

మరోవైపు ఇంకా వెంకయ్య బెజవాడలోకి అడుగు పెట్టకుండానే వామపక్షాలు ఆయనకి వ్యతిరేకంగా గళమెత్తాయి.వెంకయ్య గో బ్యాక్ అంటూ రామవరప్పాడు జంక్షన్ లో నిరసన ర్యాలీ కి దిగారు. హోదా అంశంలో రాష్ట్రాన్ని మోసం చేసి ఇంకా ఎదురుదాడికి దిగుతున్న వెంకయ్యకి విలువల్లేవని లెఫ్ట్ నేతలు మండిపడ్డారు. వామపక్షాల ర్యాలీ ని పోలీసులు అడ్డుకుని వారిని అరెస్ట్ చేసి భవానీపురం స్టేషన్ కి తరలించారు.

SHARE