Posted [relativedate]
ప్రస్తుతం తమిళనాడుకు పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి అయినా.. అసలు గాడ్ ఫాదర్ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడేనని ప్రచారం జరుగుతోంది. దీని వెనక పెద్ద కారణం లేకపోలేదు. జయలలిత తర్వాత ఆ స్థాయిలో అన్నాడీఎంకేలో పెద్ద నాయకులెవరూ లేరు. జయ కన్నుమూయడంతో ఎమ్మెల్యేలను మ్యానేజ్ చేసే నాయకుడు లేకుండా పోయారు. పన్నీరు సెల్వం ఉన్నా ప్రస్తుతానికి ఓకే కానీ.. అనుకోని రాజకీయ సంక్షోభం తలెత్తితే ఆయన తట్టుకోవడం కష్టం. అందుకే ఆయన కేంద్ర పెద్దలను అండగా ఉండాలని కోరారట. అందుకు మోడీ నుంచి కూడా సానుకూల సంకేతాలున్నాయని సమాచారం.
ప్రస్తుతం తమిళనాడులో బీజేపీకి ప్రాధాన్యత లేదు. ప్రజెంట్ పాలిటిక్స్ ను కొంత సానుకూలంగా మార్చుకుంటే బీజేపీకి కొంత మైలేజ్ కూడా వస్తుంది. సరిగ్గా ఇదే పాయింట్ ఆధారంగా మోడీ కూడా తమిళనాడు ప్రభుత్వానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారట. తమిళనాడు పాలిటిక్స్ పై వెంకయ్యకు కొంత అవగాహన ఉంది. అంతేకాకుండా ఆయన సౌత్ కు చెందిన నాయకుడు. అన్నాడీఎంకే నేతలను మ్యానేజ్ చేయగల టాలెంట్ ఉంది. మంచి అనుభవజ్ఞుడు. బీజేపీ జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా పని చేసి రాలుదేలారు కూడా. అందుకే ఈ తరుణంలో వెంకయ్యనాయుడు బెటర్ ఆప్షన్ గా మోడీ ఎంచుకున్నారట. ఇక తమిళ పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టాలని సూచించారట. అందులో భాగంగానే వెంకయ్య కూడా ఇప్పుడు చెన్నైలోనే ఆయన మకాం వేశారని చెబుతున్నారు.
మోడీ అండ ఉంది కాబట్టి ఇక వెంకయ్య కూడా తమిళనాడుపై ఫోకస్ పెట్టబోతున్నారట. ఆదిశగా ఇప్పటికే పన్నీరు సెల్వంతోనూ భేటీ అయ్యి అన్ని విషయాలు చెప్పారట. సో ఇంకేముంది ఇక తమిళనాడు రాజకీయమంతా వెంకయ్య చేతుల్లోకి వచ్చేసినట్టేనని చెబుతున్నారు.