పవన్ కి హీట్…రాజకీయ స్పాట్

  venkaiah naidu siddharth nath singh angry on pawan kalyan
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి హీట్ తగిలింది.రాజకీయం పెట్టే స్పాట్ ఎలా ఉంటుందో అర్ధమైంది.తిరుపతి,కాకినాడ సభల తర్వాత అంతా మారిపోయింది.ఒకప్పుడు ఆయన్ని విమర్శించడానికి రాజకీయ ప్రత్యర్ధులు కూడా వెనుకాడిన మాట నిజం.రోజా లాంటి కొందరు మాత్రమే కొంత దూకుడుగా వ్యవహరించారు.కానీ రెండు సభల తరువాత సీన్ మారిపోయింది.తిరుపతి సభ తరువాత కూడా సంయమనం పాటించిన బీజేపీ కాకినాడ సభ తర్వాత రూట్ మార్చింది.టాప్ గేరు లో పవన్ మీదకి దూసుకెళ్తోంది.కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్వయంగా రంగంలోకి దిగి తనపై ఆరోపణలకు సమాధానమిచ్చారు. ఆయనకు అండగా కాషాయదళం పవన్ పై రెచ్చిపోయింది.

ఏపీ వ్యవహారాల ఇంచార్జి సిద్ధార్ధనాథ్ సింగ్ మరీ దూకుడు ప్రదర్శించారు.ముఖ్యమంత్రి పదవికోసమే పవన్ …వెంకయ్యని టార్గెట్ చేస్తున్నారన్నారు.హోదా ,ప్యాకేజ్ అంశాలపై చర్చకి రావాలని సవాల్ విసిరారు.
సున్నిత మనస్కుడైన పవన్ దీన్ని ఎలా తీసుకుంటారో!ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి .కానీ ఒక్కటి మాత్రం నిజం…హోదా అంశంలో బీజేపీ మాట తప్పిన విషయానికే పరిమితం కాకుండా …ప్యాకేజ్,హోదా మధ్య తేడా ..వాటి వల్ల కలిగే లబ్ది వంటి గురించి పవన్ అధ్యయనం చేయాలి.హోదా వల్ల ఎక్కువ ప్రయోజనమని ప్రజల్లో లెక్కల ద్వారా నమ్మకం కలిగించాలి.కేవలం ఆవేశపూరిత ప్రసంగాలు,భావోద్వేగాలు ఎక్కువ కాలం కొనసాగవని గ్రహించి అందుకు తగ్గ రాజకీయ వ్యూహం రూపొందించుకోవాలి..

SHARE