వెంకయ్య కుమార్తె రాజకీయాల్లోకి ?

  venkaiah nayudu daughter deepa venkat coming politics
కేంద్రమంత్రి,బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన వెంకయ్యనాయుడు కుమార్తె రంగప్రవేశానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయా ? ఆమె రాజకీయ అరంగేట్రానికి వలస నేతల ఖిల్లా వైజాగ్ వేదిక అవుతోందా ? ఔననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు సమయం ఉండగానే హడావిడి అనుకుంటున్నారా ? వెంకయ్య ప్రియశిష్యుడు హరిబాబు స్థానం గల్లంతనుకుంటున్నారా?అదేమీ లేకుండానే వెంకయ్య కుమార్తె దీపావెంకట్ వైజాగ్ రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నారు.బీజేపీ తరపున మేయర్ అభ్యర్థిగా ఆమె రంగంలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం.

ప్రస్తుతం స్వర్ణభారతి ట్రస్ట్ వ్యవహారాలు చూస్తున్న దీపా వెంకట్ కి ఆదినుంచి రాజకీయాల పట్ల ఆసక్తి,తండ్రి వ్యవహారాలు దగ్గరుండి చూసిన అనుభవం వుంది.ఆమె చురుకుదనం గురించి వెంకయ్య పలు సందర్భాల్లో ప్రస్తావించారు.ఆమెని రాజకీయాలకు ప్రత్యక్షంగా పరిచయం చేసే అవకాశం కోసం అయన ఎదురు చూస్తున్నారు.ప్రత్యేక హోదా డిమాండ్ నేపథ్యంలో ఆంధ్రాలో బీజేపీ పరిస్థితి దిగజారింది.తాజాగా భారీ ప్యాకేజ్ లేదా హోదా ఇవ్వడానికి కేంద్రం సుముఖంగా ఉందన్న వార్తలు వస్తున్నాయి.ఈ ప్రక్రియలో వెంకయ్య కీలక పాత్ర పోషిస్తున్నారు.ప్రధాని మోడీని ఒప్పించడానికి కూడా అయన గట్టి ప్రయత్నమే చేసారని తెలుస్తోంది.ఆ ప్రకటన లాంఛనం కూడా పూర్తి అయితే మళ్లీ బీజేపీ అనుకూల పవనాలు వీస్తాయని ,దేశంతో పొత్తుకు ఇబ్బంది ఉండదని వెంకయ్య ప్లాన్ .

క్లిష్టమైన నెల్లూరు రాజకీయాల కన్నా నగర,ప్రశాంత వాతావరణం వుండే వైజాగ్ అయితే అన్ని విధాలుగా మేలని వెంకయ్య,దీప భావిస్తున్నట్టు తెలుస్తోంది.ఆంధ్రాకి కేంద్రం నుంచి శుభవార్త వినిపించడానికి పరోక్షంగా వెంకయ్య కుమార్తె రాజకీయ ఆసక్తి కూడా ఎంతోకొంత పనిచేసినట్టే!

SHARE