‘వెంకటాపురం’ సక్సెస్‌ టాక్‌.. కాని ‘బాహుబలి’ ఎఫెక్ట్‌

0
549
venkatapuram movie get positive talk but no collections because of bahubali 2 movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

venkatapuram movie get positive talk but no collections because of bahubali 2 movie
హ్యాపీడేస్‌ ఫేం రాహుల్‌ హీరోగా తెరకెక్కిన సస్పెన్స్‌ థ్ల్రిర్‌ చిత్రం ‘వెంకటాపురం’. ఈ సినిమాను శ్రేయాస్‌ శ్రీనివాస్‌ గుడ్‌ సినిమా గ్రూప్‌ బ్యానర్‌లో నిర్మించిన విషయం తెల్సిందే. విడుదలకు ముందే ట్రైలర్‌తో సినీ వర్గాల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం విడుదల తర్వాత కూడా పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకుంది. నిన్న విడుదలైన ‘వెంకటాపురం’ సినిమాకు ప్రేక్షకుల నుండి బాగుందనే టాక్‌ వినిపిస్తుంది. అయితే కలెక్షన్స్‌ మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు.

‘బాహుబలి’ విడుదలై రెండు వారాలు అయినా కూడా కలెక్షన్స్‌ ఏమాత్రం తగ్గలేదు. ఆ కలెక్షన్స్‌ సునామి ముందు పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ‘వెంకటాపురం’కు మంచి ఓపెనింగ్స్‌ దక్కడం లేదని అంటున్నారు. ‘బాహుబలి 2’కు రిపీట్‌ ఆడియన్స్‌ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ‘వెంకటాపురం’ టికెట్లు కట్‌ అవ్వడం కష్టంగా ఉంది. వచ్చే వారం వరకు కొత్త సినిమాలు వస్తున్న నేపథ్యంలో వెంకటాపురంకు మరింత కష్టం తప్పేలా లేదని ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.

Leave a Reply