బారిస్టర్ పార్వతీశంగా వెంకీ..

Posted March 31, 2017

venkatesh as barrister parvateesam biopic movieటాలీవుడ్, బాలీవుడ్ అన్న బేధం లేకుండా ఇప్పుడు బయెపిక్ ల హవా తెగ నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ బయోపిక్ కి  రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో బయోపిక్ రానుందని సమాచారం.

రిస్క్ లేకుండా రీమేక్ సినిమాల వంటి మినిమమ్ గ్యారెంటీ సినిమాలను ఎంచుకుంటున్నాడు  వెంకటేష్. బాలీవుడ్లో ఘన విజయం సాధించిన సాలా ఖద్దూస్ సినిమాకు రీమేక్ గా గురు సినిమాతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిన్న ప్రీమియర్ షోల ద్వారా హిట్ టాక్ ని సొంతం చేసుకున్నాడు వెంకీ. తాజాగా ఈ హీరో కన్ను బయోపిక్ మీద పడింది. బారిస్టర్ పార్వతీశం బయోపిక్ లో వెంకీ నటించనున్నాడని తెలుస్తోంది. గతంలో పదోతరగతి నాండిటేల్ లో బారిస్ట‌ర్ పార్వ‌తీశం బ‌యోగ్ర‌ఫీ ఉండేది గుర్తింది కదూ. పార్వతీశం లండన్ వెళ్లి అక్క‌డ ఎలాంటి పాట్లు ప‌డ్డాడు.. అన్న‌ది చాలా ఇంట్రెస్టింగ్‌ గా ఉంటుంది. ఇప్పుడు ఇదే క‌థ‌ని వెంకీ హీరోగా తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు జరుగుతున్నాయ‌ని తెలుస్తోంది. పార్వతీశం పాత్రలో వెంకీ సరిగ్గా సరిపోతాడని భావించిన దర్శకుడు సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజిగా ఉన్నాడట. త్వరలోనే ఈ సినిమాపై క్లారిటీ ఇవ్వనున్నాడట వెంకీ. మరి గురుగా అలరించిన వెంకీ బారిస్టర్ పార్వతీశంగా ఎలా అలరిస్తాడో చూడాలి.

SHARE