గురు ముందే వస్తున్నాడుగా..!!

 Posted March 23, 2017

venkatesh guru movie release on march 31విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం గురు. తమిళ, హిందీ భాషల్లో రూపొందిన సాలా ఖద్దూస్ సినిమాకి తెలుగు రీమేక్ గా గురు సినిమా రూపొందింది. వెంకీ ఇందులో బాక్సింగ్ కోచ్ గా కనిపించనున్నాడు. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాలో రితికా సింగ్ హీరోయిన్ గా నటించింది. నిజానికి ఈ సినిమా కంప్లీట్ అయ్యి చాలా కాలమే అయినా ఇప్పటి వరకు రిలీజ్ కి నోచుకోలేదు.

మొదట ఈ సినిమాను జనవరి 26న విడుదల చేయాలనీ భావించినా పలు  కారణాల వల్ల ఏప్రిల్ 7కి వాయిదా వేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని అనుకున్న సమయం కంటే ముందుగానే విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోందట. ఏప్రిల్ 7న మణిరత్నం చెలియా సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో క్లాష్ ఇష్టం లేని దర్శకనిర్మాతలు గురుని  మార్చి 31నే  విడుదల చేయాలని  నిర్ణయించారని తెలుస్తోంది. మరి “గురు” వుగారు  ఎప్పుడు దయ చేస్తారో చూడాలి.

SHARE