వెంకటేష్ గురు టీజర్ రిలీజ్..!

Posted December 13, 2016

Venkatesh Guru Movie Telugu Teaser Releasedవిక్టరీ వెంకటేష్ నటిస్తున్న గురు సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. తమిళ హింది భాషల్లో సూపర్ హిట్ అయిన సాలా ఖదూస్ సినిమా రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ బాక్సింగ్ కోచ్ గా కనిపించనున్నారు. మాత్రుక డైరెక్ట్ చేసిన సుధ కొంగర తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తుండగా హింది తమిళంలో లీడ్ రోల్ చేసిన రితిక సింగ్ కూడా గురులో నటిస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అంచనాలను పెంచేసిన వెంకటేష్ ఈరోజు రిలీజ్ చేసిన ఓ మ్యూజిక్ బిట్ టీజర్ తో అందరిని ఆకట్టుకున్నాడు.

గడ్డంతో మాసీ లుక్ గా ఉన్నా సరే వెంకటేష్ లుక్ అదుర్స్ అనేలా ఉంది. ఈరోజు విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ టీజర్ రిలీజ్ చేయడం జరిగింది. సినిమాను జనవరి 26న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. వై నాట్ స్టూడియోస్ తో పాటుగా సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. ఇక ఈ ఇయర్ ఇప్పటికే బాబు బంగారంతో వారెవా అనిపించిన వెంకటేష్ ఈ గురు సినిమాతో ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి.

SHARE