“గురు”వుగారి ట్రైలర్ వస్తోంది

Posted March 18, 2017

venkatesh guru movie trailer detailsబాబు బంగారం సినిమా ఇచ్చిన జోష్ తో  వెంకటేష్ వెంటనే గురు సినిమాను మొదలుపెట్టాడు. మొదట ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో వెంకీ..  జిమ్ లో గంటలు గంటలు గడిపి తెగ కండలు పెంచేశాడు. ఇక సినిమాను కూడా  యుద్దప్రాతిపదికన కంప్లీట్ చేశారు. మొత్తం అంతా రెడీ అయిన  తర్వాత గురు సైలెంట్ అయిపోయాడు.

సంక్రాంతికి  కాకపోతే సమ్మర్ లోనైనా వస్తాడని ఎదురుచూశారు అభిమానులు. అయితే బాహుబలి దెబ్బకు డీజే లాంటి సినిమాలే వెనక్కి తగ్గే సరికి  గురువు గారు ఇక చప్పుడు చేయడంలేదు. సమ్మర్ కి కూడా రిలీజ్ చేసే ఆలోచనలో లేరట దర్శకనిర్మాతలు.  అయితే అభిమానులను అప్ సెట్ చేయడం ఇష్టం లేని వెంకీ ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం పెట్టేశాడు. ఈ నెల 20న గురు ట్రైలర్ విడుదల కాబోతోంది. సినిమా ఎప్పుడన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వని వెంకీ ట్రైలర్ తో టైమ్ పాస్ చేస్తున్నాడు. బాహుబలి-2 హంగామా తగ్గేవరకు గురు వెయిట్ చేస్తాడో ఏంటో చూడాలి.

SHARE