ఆరోజు టీజర్ గిఫ్ట్ ఇస్తున్న వెంకటేష్..!

0
593

Posted [relativedate]

డిసెంబర్ 13 దగ్గుబాటి ఫ్యాన్స్ కు పండుగరోజు. కొంతకాలంగా ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలతో కాస్త నిరాసపడేలా చేసిన వెంకటేష్ ట్రెండ్ మార్చి మళ్లీ తన సత్తా చాటుతున్నాడు. రీసెంట్ గా మారుతి దర్శకత్వంలో వచ్చిన బాబు బంగారం వెంకీ మార్క్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఇక ప్రస్తుతం వెంకటేష్ చేస్తున్న సినిమా గురు. హింది సినిమా సాలా ఖదూస్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ అందరిని ఇంప్రెస్ చేసింది.

ఇక సినిమా టీజర్ వెంకటేష్ బర్త్ డే నాడు అంటే డింసెంబర్ 13న రిలీజ్ చేయాలని చూస్తున్నారు. సుధ కొంగర డైరెక్ట్ చేస్తున్న గురు సినిమాలో బాక్సింగ్ కోచ్ గా వెంకటేష్ కనిపిస్తుండగా రితిక సింగ్ శిష్యురాలిగా నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ దాదాపు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా టీజర్ ఎలా ఉండబోతుందో అని వెంకీ ఫ్యాన్స్ లో ఎక్సయిట్మెంట్ స్టార్ట్ అయ్యింది. జనవరి 26న సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్న వెంకటేష్ ఈ సినిమా తర్వాత నేను శైలజ డైరక్టర్ కిశోర్ తిరుమలతో ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా చేస్తున్నాడు.

Leave a Reply