మెగా క్యాంపు హీరోలకి వల్లకానిది వెంకీతో?

0
632
venkatesh in chiru uyyalawada narasimha reddy movie

Posted [relativedate]

venkatesh in chiru uyyalawada narasimha reddy movie
మెగా స్టార్ చిరంజీవి 151 వ సినిమాలో మరో స్టార్ హీరో కనిపిస్తారని వస్తున్న వార్తలు తెలుగు సినీ లవర్స్ ని కట్టిపడేస్తున్నాయి.ఆ హీరో విక్టరీ వెంకటేష్ అని కూడా సోషల్ మీడియా కోడై కూస్తోంది. చిరు 151 వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ కొణిదెల బ్యానర్ మీదే ప్రొడ్యూస్ చేస్తున్న విషయం తెలిసిందే.చిరు ఖైదీ నెంబర్ 150 విషయంలోనూ ఇలాంటి వార్తలు చాలా వచ్చాయి.కానీ అవేమీ నిజం కాలేదు.ఇప్పుడు 151 వ సినిమా విషయంలో మాత్రం ఆ లోటు లేకుండా చూసేందుకు చరణ్ స్వయంగా వెంకీ తో మాట్లాడి నిర్ధారించుకున్నాకే ఈ వార్త లీక్ చేశారని కూడా చెబుతున్నారు.

నిజంగా చిరు తో వెంకీ కలిసి నటిస్తే అది పెద్ద విశేషమే అవుతుంది.మెగా స్టార్ తో చేయడం ఓ ఎత్తు అయితే ఇంతకుముందు గోపాల గోపాల సినిమాలో పవర్ స్టార్ పవన్ తోను కలిసి చేశారు వెంకీ.ఇక నాగబాబు తోను షాడో లాంటి చిత్రాల్లో నటించారు.చిరు సినిమా చేస్తే కనుక ముగ్గురు మెగా బ్రదర్స్ తో నటించిన ఘనత వెంకీ సొంతమవుతుంది.ఒక్క మల్టి స్టారర్ కే సన్నాయి నొక్కులు నొక్కుతున్న హీరోలున్న ఈ రోజుల్లో మెగా బ్రదర్స్ అందరితో నటిస్తున్న వెంకీని మెచ్చుకోవాల్సిందే. ఏమైనా మెగా క్యాంపు హీరోలకే వల్ల కాని పని వెంకీ చేసేస్తున్నాడు.ఆల్ ది బెస్ట్ వెంకీ..

Leave a Reply