పూరీ దర్శకత్వంలో వెంకీ

Posted March 20, 2017

venkatesh in puri jagannadh directionగురు సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు వెంకటేష్. ఈ సినిమా తర్వాత వెంకీ తదుపరి సినిమా గురించి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం వెంకీ తన నెక్ట్స్ సినిమాను పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో చేయనున్నాడని తెలుస్తోంది.

ప్రస్తుతం బాలకృష్ణ సినిమాను చేస్తున్న పూరీ… ఈ సినిమా తర్వాత వెంకీ సినిమాను పట్టాలెక్కించనున్నాడట. నిజానికి బాలయ్య సినిమా కంటే వెంకీ సినిమానే మొదలు కావాల్సిఉంది. అయితే నిర్మాణ లావాదేవీల్లో క్లారిటీ రాకపోవడంతో వెంకీ ఈ సినిమాను హోల్డ్ చేశాడట.

కాగా  వెంకీ.. క్రిష్ తో గానీ, తిరుమల కిషోర్ తో గానీ అనుకున్న సినిమాలు కార్యరూపం దాల్చలేదు. దీంతో చేసేది లేక వెంకీ..  పూరీకే ఓటేశాడట. పూరీ చెప్పిన స్టోరీ కూడా బాగా నచ్చడంతో  ఈ సినిమానే చేయాలని ఫిక్స్ అయ్యాడట వెంకీ. బాలయ్య సినిమా షూటింగ్ పూర్తి అవ్వగానే వెంకీ తన సినిమాను స్టార్ట్ చేయనున్నాడని తెలుస్తోంది. దేశభక్తి నేపధ్యంలో సాగే ఈ సినిమా జూన్ నుండి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

SHARE