వెంకీ అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట..!

0
386
venkatesh jeethu joseph movie

venkatesh jeethu joseph movie

బాబు బంగారంతో రిలీజ్ నాడు డివైడ్ టాక్ తెచ్చుకున్నా సేఫ్ జోన్లోనే వచ్చాడు విక్టరీ వెంకటేష్. మారుతి మార్క్ కామెడీతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిని. అయితే ఈ జోష్ తోనే వెంకటేష్ ఇక రానున్న సినిమాలకు ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా చేసే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇప్పటికే సాలా ఖద్దూస్ సినిమా రీమేక్ లో నటిస్తున్న వెంకీ ఆ చిత్ర మాత్రుక దర్శకురాలు సుధ కొందర డైరక్షన్లోనే ఈ సినిమా చేస్తుండటం విశేషం.

ఇక తర్వాత సినిమా కూడా లైన్లో పెట్టాడు వెంకీ. మలయాళ దృశ్యం డైరక్టర్ జీతు జోసెఫ్ తో సినిమాకు ఫైనల్ గా ఓకే చెప్పేశాడు వెంకటేష్. దృశ్యం టైంలోనే ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందని వార్తలు వచ్చినా అది కుదరలేదు. ఇక ఈ మధ్యనే అద్భుతమైన కథ ఒకటి వెంకటేష్ కు వినిపించాడట జీతు జోసెఫ్, కథ నచ్చడంతో వెంకటేష్ వెంటనే ఓకే చెప్పేశాడట. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్ లో నిర్మించబడుతుందని తెలుస్తుంది. ఈ మధ్య స్పీడ్ తగ్గించినట్టు కనిపించిన వెంకటేష్ బాబు బంగారం ఇచ్చిన హిట్ కిక్ తో మళ్లీ ఫాంలోకి వచ్చాడని చెప్పొచ్చు.

Leave a Reply