ఆ కలంలో…మళ్లీ గోపాలగోపాలా

 venkatesh pawan kalyan act trivikram directionమల్టీస్టారర్‌ సినిమాల విషయంలో మన కథానాయకుల ఉత్సాహంగానే ఉంటున్నారు. కథ నచ్చితే ఎవరితో అయినా సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయంలో వెంకటేష్‌ ఓ అడుగు ముందే ఉన్నారు. మహేష్‌ బాబు, పవన్‌ కల్యాణ్‌లతో కలసి మంచి హిట్స్‌ ఇచ్చారు. మరోసారి పవన్‌తో కలసి వెంకీ ఓ సినిమా చేయబోతున్నారన్నది ఫిల్మ్‌నగర్‌ టాక్‌. పవన్‌ కల్యాణ్‌ – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. నవంబరులో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.

ఇందులో వెంకటేష్‌ కూడా నటిస్తారని అంటున్నారు. వెంకటేష్‌ – త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’ సినిమాలొచ్చాయి. ఈ చిత్రాలకు దర్శకులు మరొకరైనా.. కథలు రాసింది మాత్రం త్రివిక్రమ్‌. త్రివిక్రమ్‌ పంచ్‌లు వెంకీ, పవన్‌ పలికితే ఆ కిక్కే వేరు. మరోసారి ఆ వినోదాల విందు అందించడానికి వెంకీ, పవన్‌లు సిద్ధమవుతున్నారని అభిమానులు సంబరపడిపోతున్నారు.

SHARE