కోచ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు..

0
467

venkatesh-saala-khadoos-box

మారుతి దర్శకత్వంలో చేసిన విక్టరీ వెంకటేష్ ‘బాబు బంగారం’ అన్ని పనులను పూర్తి చేసుకుంది. ఆగష్టు 12న థియేటర్స్ లో అడుగిడుతున్న ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎందుకంటే.. చాలా గ్యాప్ తీసుకుని వెంకీ చేసిన చిత్రమిది. దాంతో పాటే హ్యూమర్-సీరియస్ యాంగిల్ ఉన్న పోలీసాఫీసర్ గా ఆయన కనిపిస్తున్నారు. తన మార్క్ వినోదం ఖాయమని ట్రైలర్ లో చెప్పకనే చెప్పేశారు వెంకీ. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైపోయిందంటే.. దీనికి సంబంధించి పనంతా కంప్లీట్ అయినట్టే. దీంతో వెంకీ మరో సినిమాను ప్రారంభించే పనుల్లో ఉన్నారు. మాధవన్ నటించిన ‘సాలా ఖడూస్’ కు రీమేక్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆయన బాక్సింగ్ కోచ్ గా కనిపిస్తారు.

వెంకీ కొత్త ప్రాజెక్టుకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగం పుంజుకున్నాయి. ఈ మూవీ కోసం వెంకీ కసరత్తులు చేస్తున్నారని అంటున్నారు. బాక్సింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారని టాక్. మరోవైపు ఈ చిత్రంలోని పాటల కోసం సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలుపెట్టారట. ఈ సినిమా మాతృకకు దర్శకత్వం వహించిన సుధా కొంగరే వెంకీ మూవీనీ డైరక్ట్ చేస్తున్నారు.

Leave a Reply