Tuesday, June 28, 2022
Homelatestవెంకయ్యది కన్నీరా..? పన్నీరా..?

వెంకయ్యది కన్నీరా..? పన్నీరా..?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పొద్దున లేసిన దగ్గర్నుంచి మోడీని దైవదూతగా అభివర్ణిస్తూ తిరిగే కేంద్రమంత్రి వెంకయ్యకు.. ఓ విషయంలో మాత్రం బీజేపీ సర్కారుపై కోపమొచ్చిందంటే. అయితే అది కేంద్ర ప్రభుత్వం కాదు. మధ్యప్రదేశ్ రాష్ట్ర సర్కారు. మాండసౌర్ లో రైతులపై కాల్పులు సరికాదంటూనే.. కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని విరుచుకుపడ్డారు వెంకయ్య. రైతులకు ఎప్పుడూ లేని విధంగా రుణాలిచ్చామని, సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధులిచ్చామని వెంకయ్య చెప్పుకొచ్చారు.

బీజేపీ సర్కారు ఎప్పుడొచ్చినా జీడీపీ, స్టాక్ మార్కెట్ లెక్కలే కానీ, రైతుల సమస్యలు పట్టించుకోదనే అపవాదు ఉంది. అందుకు తగ్గట్లుగానే మోడీ ప్రధాని అయ్యాక.. సామాన్యుల సమస్యలు గాలికొదిలేసి.. ఇండియా బ్రాండ్ పెంచుతున్నామంటూ కబుర్లు చెప్పడం ఎక్కువైంది. బ్లాక్ మనీని టార్గెట్ చేసిన డీమానిటైజేషన్ మిస్ ఫైర్ అయింది. ఆర్భాటంగా మొదలెట్టిన ఫసల్ బీమా యోజనలో సవాలక్ష లొసుగులున్నాయి.

క్షేత్రస్థాయిలో వాస్తవాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంటే రైతుల్ని ఉద్ధరించేశామని వెంకయ్య చెప్పుకోవడం వింతల్లో కెల్ల పెద్ద వింత. రైతులు చనిపోయారని మొసలి కన్నీరు కారుస్తున్న వెంకయ్య.. హస్తినలో తమిళ రైతులు రకరకాలుగా నిరసన తెలిపినా.. ప్రధాని ఎందుకు స్పందించలేదనే మాటకు మాత్రం జవాబు చెప్పరు. ఇంతకూ మధ్యప్రదేశ్ లో రైతులు చనిపోయారని కన్నీరు కారుస్తున్నారా.. లేదంటే ముందుగానే పోలీసులు కాల్పులు జరిపి ఉద్యమ వేడి తగ్గించారని పన్నీరు కారుస్తున్నారా అనే డౌట్లు వస్తున్నాయి.

- Advertisment -
spot_img

Most Popular