బీజేపీలో వెంక‌య్య.. ఇక కరివేపాకేనా

0
338
Venkayya is the BJP party on TDP party

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Venkayya is the BJP party on TDP party

రెండు తెలుగురాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అంటేనే వెంక‌య్య‌నాయుడు.. ఆయ‌న ఎంత చెప్తే పార్టీలో అంత అనే ప‌రిస్థితి గ‌తంలో ఉండేది. ఏ చిన్న కార్య‌క్ర‌మం జ‌రిగినా అంతా తానై.. త‌న మ‌నుషుల‌తోనే న‌డిపించే వెంక‌య్య ఇప్పుడు అమిత్‌షా ప‌ర్య‌ట‌న‌లో ఊసే లేకుండా పోయాడు. రాష్ట్రంలో శ‌ర‌వేగంగా మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాలపై మాట‌మాత్ర‌మైనా అన‌కుండా నోరు క‌ట్టుకుని కూర్చుంటున్నాడు. కేంద్రంలో ప‌దేళ్ల‌కుపైగా అధికారంలో ఉన్నప్ప‌టికీ బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో పుంజుకోక‌పోవ‌డానికి వెంక‌య్యే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని అధిష్టానం గుర్తించి ఆయ‌న‌కు అక్షింత‌లు వెయ్య‌డ‌మే వెంక‌య్య‌లో మార్పుకు కార‌ణ‌మ‌ని బీజేపీ వ‌ర్గాలు చెప్తున్నాయి.

పార్టీ కార్య‌క్ర‌మాల్లో వెంక‌య్య‌ను జోక్యం చేసుకోవ‌ద్దంటూ ఆదేశించింద‌ని పార్టీ అంత‌రంగీకుల స‌మాచారం. ఈ దెబ్బ‌తో పార్టీలో అన్నీ ముందుండి న‌డిపించిన వెంక‌య్య ఇక‌ వెన‌క‌య్యేన‌ని కాషాయ నేత‌లు చెప్పుకుంటున్నారు. త‌న రాజ‌కీయ ప్ర‌వేశం నుంచి అంటే దాదాపు నల‌భై ఏళ్లుగా వెంక‌య్య‌నాయుడు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని శాసిస్తూ వ‌చ్చాడు. ఇరు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులుగా ఎవ‌రు ప‌నిచేసినా అధికారం మొత్తం వెంక‌య్య‌నాయుడు చేతిలోనే ఉండేది. పార్టీ ప‌ద‌వుల నియామ‌కం, కార్య‌క్ర‌మాలు అన్నీ వెంక‌య్య క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగేవి. ఆయ‌న మాట‌ను కాద‌న్న వారు పార్టీలో ఎక్కువ రోజులు మ‌నుగ‌డ సాధించ‌లేర‌నేది బీజేపీలో బాహాటంగానే విన‌ప‌డే విష‌యం.

అలాంటి వెంక‌య్య ఏక ఛ‌త్రాధిప‌త్యానికి బీజేపీ ఇప్పుడు బ్రేకులు వేసింది. అంతేకాదు ఇక‌పై పార్టీ కార్య‌క్ర‌మాల్లో జోక్యం చేసుకోవ‌ద్దు అంటూ స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. పార్టీలో వెంక‌య్య ప్ర‌స్తుత దీన‌స్థితికి ఆయ‌న స్వ‌యం కృతాప‌రాధ‌మే కార‌ణం. చంద్ర‌బాబును స‌మ‌ర్ధిస్తూ రాష్ట్రంలో బీజేపీని ద్వితీయ స్థాయి పార్టీలా కొన‌సాగేలా చేశాడ‌ని పార్టీలో ఆయ‌నంటే గిట్ట‌నివారు అధిష్టానం చెవిలో ఇళ్లు క‌ట్టుకుని పోరుతూ వ‌చ్చినా ఢిల్లీ పెద్ద‌లు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దీంతో ఇక త‌న‌కు తిరుగేలేదు అనుకుని వెంక‌య్య చంద్ర‌బాబు భ‌జ‌న‌లో చెల‌రేగిపోయాడు. రాష్ట్రంలో చంద్ర‌బాబు నిర్వ‌హించే ప్ర‌తి ప‌బ్లిసిటీ స్టంట్‌లో పాల్గొంటూ బాబు ఇంద్రుడూ, చంద్రుడూ అంటూ పొగుడుతూ అస‌లు ఆయ‌న బీజేపీ నాయకుడా లేక టీడీపీ నేతా అని ప్ర‌జ‌లు అనుమానించే స్థాయికి వెంక‌య్య ప‌డిపోయాడు.

Leave a Reply