వెంకయ్య నోట్లో ఐస్..స్పైస్

0
557

venkayya naidu tdp ycp

        హోదా అంశంలో ఎన్ని విమర్శలు వచ్చినా కేంద్రమంత్రి వెంకయ్య ధైర్యంగా విశాఖపట్నం లో సన్మానం చేయించుకున్నారు .ఈ సభలోనే మిత్ర పక్షం టీడీపీ కి ఓ పక్కఐస్ పెట్టే వార్త చెప్పారు .తమ్ముళ్లు చంకలు గుద్దుకొనేలోపే మరో స్పైసీ వ్యాఖ్య చేసి షాక్ ఇచ్చారు.ఇంతకీ ఆ ఐస్,స్పైస్ ఏంటోచూద్దామా ?

       విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు ఖాయమని వెంకయ్య ఘంటాపధంగా చెప్పారు.అబ్బా ఎంత చల్లటి వార్త అనుకొనేలోపే మిత్రపక్షానికి షాక్ ఇచ్చే ఘాటు కామెంట్ చేశారు .పార్టీలు మారి వచ్చేవాళ్ళు తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనన్నారు .వైసీపీ నేతల తాకిడితో జబ్బలు చరుచుకుంటున్న దేశానికి ఇది మింగుడు పడదు కదా ! సహజం గానే వైసీపీ పండగ చేసుకొంటోంది .వెంకయ్య వ్యాఖ్యలు అనుకోకుండా వచ్చాయా? లేక ఉద్దేశపూర్వకమా…లేక దీని వెనక హోదా కాక ఉందా?

      మిత్రపక్షం వైరిపక్ష బిల్లుకు మద్దతివ్వడం వెంకయ్యను మండించిందా ? అందుకే అయన దేశానికి స్పైస్…వైసీపీకి ,వైజాగ్ కి ఐస్ పెట్టారా ? ఇది మారబోయే రాజకీయ పరిణామాల సూచికా?

అన్నీ సమాధానం లేని ప్రశ్నలే ….కాలమే వీటికి జవాబు చెప్పగలదు .

Leave a Reply