ఏపీని లైట్ తీసుకుంటున్న వెంకయ్య!!

0
250
venkayya taking andhrapradesh easy

Posted [relativedate]

venkayya taking andhrapradesh easy కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఏపీ రాజకీయాల్లో అందరి కంటే సీనియర్. ఆ మాటకొస్తే చంద్రబాబు కంటే కూడా ఆయనకు ఎక్కువ అనుభవం ఉంది. దక్షిణాది వ్యక్తి అయినప్పటికీ ఓ జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఎదిగిన ఘనత ఆయనది. అలాంటి వెంకయ్య నాయుడు ఇప్పుడు సొంత రాష్ట్రం ఏపీని లైట్ తీసుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది.

ఈ మధ్య ఏపీ రాజకీయాలకు వెంకయ్య దూరంగా ఉంటున్నారట. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు కూడా దూరం పాటిస్తున్నట్టు టాక్. ఈ మధ్య వరుసగా ఆయన కొన్ని కార్యక్రమాలకు డుమ్మా కొట్టడమే అందుకు నిదర్శనం. ఇటీవల పోలవరం ప్రోగ్రామ్ లో వెంకయ్య కనిపించలేదు. ఇక తిరుపతిలో జరిగిన సైన్స్ కాంగ్రెస్ కు నాయుడు గారు రాలేదు. ప్రధాని మోడీ వచ్చినా.. వెంకయ్య నాయుడు డుమ్మా కొట్టారంటే దాని వెనక వేరే కారణం ఉందని ప్రచారం జరుగుతోంది.

కేంద్రం ఎంత సపోర్ట్ ఇస్తున్నా… ఏపీలో బీజేపీ తీరు మారడం లేదు. పైగా ప్రత్యేక హోదా అంశంలో కమలనాథులంటేనే జనం గుర్రుగా ఉన్నారు. అందుకే ఇక ఏం చేసినా లాభం లేదనే నిర్ణయానికి వచ్చారట వెంకయ్య నాయుడు. ఈ పరిస్థితుల్లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వొద్దని ఫిక్స్ అయిపోయారని టాక్. అందుకే తన మంత్రిత్వశాఖపైనే వెంకయ్య ఎక్కువ ఫోకస్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. కొంతకాలంపాటు ఢిల్లీకే ఆయన పరిమితం కానున్నారని సమాచారం.

Leave a Reply