ప‌వ‌న్ పై వెంక‌య్య వ‌ర్గం క‌న్నెర్ర‌!!!

0
256
venkayyanaidu followers serious on pawankalyan,

Posted [relativedate]

venkayyanaidu followers serious on pawankalyan,
కేంద్ర‌మంత్రి వెంక‌య్య నాయుడు ల‌క్ష్యంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ మ‌ధ్య త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ట్విట్ట‌ర్ లో హాట్ ఢైలాగుల‌తో వెంక‌య్యపై వాగ్బాణాలు సంధిస్తున్నారు. ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా… ప‌వ‌న్ పై బీజేపీ నేత‌లు ఎప్పుడూ ఎదురుదాడి చేయలేదు. కానీ ఈ మ‌ధ్య ఆయ‌న స్వ‌ర్ణ‌భార‌తి ట్ర‌స్ట్ ప్ర‌స్తావ‌న తీసుకురావ‌డంతో … వెంక‌య్య చాలా ఆగ్ర‌హంగా ఉన్నార‌ట‌. ఇక ప‌వ‌న్ ను ఏమాత్రం ఉపేక్షించ‌వ‌ద్ద‌ని క్యాడ‌ర్ కు సిగ్న‌ల్స్ పంపార‌ట‌. దీంతో బీజేపీ నుంచి ప‌వ‌న్ పై ఎదురుదాడి మొద‌లైంది.

ప‌వ‌న్ పై ఎదురుదాడి చేస్తూనే…. వెంక‌య్య‌ను వీర లెవ‌ల్లో పొగిడేశారు ఆయ‌న వ‌ర్గీయులు. బీజేపీకి చెందిన ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాల‌రావు జ‌న‌సేనానికి కౌంట‌రిచ్చారు. అభిమానులు ఉన్నారు క‌దా అని… వాళ్ల‌ను రెచ్చ‌గొట్టేలా ప్ర‌క‌ట‌న చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాదంటూ హిత‌వు ప‌లికారు. అదే స‌మ‌యంలో కేంద్ర‌మంత్రి వెంక‌య్య.. రాష్ట్రానికి చేస్తున్న కృషి మ‌రువ‌లేద‌ని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి ఒకే ఒక్క మగాడుగా ఆయ‌న ప‌నిచేస్తున్నార‌ని ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ ను చాలా సీరియ‌స్ గా తీసుకోబోతున్నారట బీజేపీ నాయ‌కులు. వెంక‌య్య‌ను ప‌ల్లెత్తు మాట అన్నా ఊరుకునేది లేద‌ని స్ట్రాంగ్ గా చెబుతున్నారు. ఇన్నాళ్లూ ప‌వ‌న్ ను ప్రియ‌మైన ప్ర‌త్య‌ర్థిగా భావించార‌ట‌. కానీ ఇప్పుడు మాత్రం జ‌న‌సేనానికి చుక్క‌లు చూపిస్తామంటున్నారు.

సాధార‌ణంగా వెంక‌య్య‌నాయుడు త‌న‌పై ఎవ‌రైనా విమ‌ర్శ‌లు చేసినా పెద్ద‌గా స్పందించ‌రు. కానీ ప‌వ‌న్ … స్వ‌ర్ణ‌భార‌తి ట్ర‌స్ట్ ప్ర‌స్తావ‌న తేవ‌డంతోనే ఆయ‌న‌కు కోప‌మొచ్చింద‌ట‌. ప‌వ‌న్ అన‌స‌రంగా ఆ ప్ర‌స్తావ‌న తెచ్చి క‌ష్టాల‌ను కొని తెచ్చుకున్నార‌ని బీజేపీ క్యాడ‌ర్ చెబుతున్నారు. ఇలాంటి కామెంట్స్ తో జ‌న‌సేనానికే క‌ష్ట‌మంటున్నారు విశ్లేష‌కులు. ఇక‌నైనా ఇలాంటి వ్య‌క్తిగ‌త ప్ర‌స్తావ‌న‌లు త‌గ్గించాల‌ని హిత‌వు ప‌లుకుతున్నారు.

Leave a Reply